Thalapathy 67: పూజా కార్యక్రమాలతో థళపతి 67ను మొదలుపెట్టిన విజయ్..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్, అప్పుడే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఇటీవల తన నెక్ట్స్ మూవీని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విజయ్, తాజాగా ఈ సినిమాను స్టార్ట్ కూడా చేశాడు.

Vijay Thalapathy 67 Launched With Pooja Ceremony
Thalapathy 67: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్, అప్పుడే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఇటీవల తన నెక్ట్స్ మూవీని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విజయ్, తాజాగా ఈ సినిమాను స్టార్ట్ కూడా చేశాడు.
Thalapathy 67 : విజయ్‌ని ఢీ కొట్టేందుకు దిగుతున్న సంజు భాయ్..
విజయ్ కెరీర్లో 67వ చిత్రంగా ఈ సినిమాను ‘‘థళపతి 67’’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. బుధవారం రోజున ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 14 ఏళ్ల తరువాత విజయ్‌తో త్రిష కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను లోకేశ్ ఎలాంటి సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుందా లేక వేరొక సబ్జెక్ట్‌తో వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.