Vikrant Rona: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న విక్రాంత్ రోణ

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ రిలీజ్‌కు ముందర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 2ను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Vikrant Rona: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న విక్రాంత్ రోణ

Vikrant Rona Locks OTT Streaming Date

Vikrant Rona: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ రిలీజ్‌కు ముందర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Vikrant Rona: నాలుగే రోజులు తీసుకున్న సుదీప్.. వారెవ్వా!

ఇక ఈ సినిమాలో కిచ్చా సుదీప్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమాలోని రక్కమ్మ సాంగ్ మాత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 భారీ రేటుకు సొంతం చేసుకుంది.

Vikranth Rona: రా రా.. అంటూ.. రక్కమ్మ వచ్చేస్తోంది!

ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 2ను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సినిమా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన వారు, ఓటీటీలో చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫర్నాండెజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.