Vikranth Rona: రా రా.. అంటూ.. రక్కమ్మ వచ్చేస్తోంది!

కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో సుదీప్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఈ పాటకు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Vikranth Rona: రా రా.. అంటూ.. రక్కమ్మ వచ్చేస్తోంది!

Vikrant Rona: కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో సుదీప్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఈ పాటకు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Vikrant Rona: నాలుగే రోజులు తీసుకున్న సుదీప్.. వారెవ్వా!

‘రా.. రా… రక్కమ్మ..’ అంటూ సాగిన ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఊపేసింది. జాక్వెలిన్ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ పాట బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దీంతో ఈ సాంగ్ ఆడియెన్స్‌లోకి బాగా వెళ్లింది. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ దూకుడుకు వెనుకబడ్డ బాలీవుడ్ సినిమాలు.. మూడు రోజుల్లో దిమ్మతిరిగే కలెక్షన్లు..

‘రారా.. రక్కమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను ఆగస్టు 12న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ పాట యూట్యూబ్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో చూడాలి.