Vikrant Rona: నాలుగే రోజులు తీసుకున్న సుదీప్.. వారెవ్వా!

కన్నడ హీరో సుదీప్ కిచ్చా నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

Vikrant Rona: నాలుగే రోజులు తీసుకున్న సుదీప్.. వారెవ్వా!

Vikrant Rona Enters Profit Zone In First Weekend

Vikrant Rona: కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు.

Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’ దూకుడుకు వెనుకబడ్డ బాలీవుడ్ సినిమాలు.. మూడు రోజుల్లో దిమ్మతిరిగే కలెక్షన్లు..

కాగా, ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగే రోజుల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని వావ్ అనిపించింది. అయితే ఇదెక్కడో అని అనుకుంటున్నారా. విక్రాంత్ రోణ సినిమాను తెలుగులో కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో మంచి బజ్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. తొలిరోజు మౌత్ టాక్ బాగా రావడంతో వీకెండ్‌లో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు. ఫలితంగా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

Vikrant Rona: మెగాస్టార్ లాంఛ్ చేసిన విక్రాంత్ రోణ టీజర్.. మామూలుగా లేదుగా!

నిజానికి ఈ సినిమాను నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్. కానీ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడంతో వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సుదీప్ మరోసారి తెలుగు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాను అనూప్ భండారి తెరకెక్కించగా, నీతా అశోక్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.