Virupaksha Trailer: ఉగాది కానుకగా విరూపాక్ష ట్రైలర్‌ను పట్టుకొస్తున్న తేజు..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు కార్తీక దండు ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తుండగా, తేజు ఈ సినిమాతో తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

Virupaksha Trailer: ఉగాది కానుకగా విరూపాక్ష ట్రైలర్‌ను పట్టుకొస్తున్న తేజు..?

Virupaksha Trailer To Be Out On Ugadi Eve

Virupaksha Trailer: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు కార్తీక దండు ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తుండగా, తేజు ఈ సినిమాతో తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

Virupaksha Teaser : విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. కొత్త కథతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుగా..

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ పజిల్‌ను వదిలింది. ‘‘సిద్ధార్థి నామ సంవత్సరే బృహస్పతిః సింహరాశౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే’’ అంటూ సంస్కృతంలో ఓ వ్యాఖ్యాన్ని తమ చిత్ర పోస్టర్‌పై పోస్ట్ చేస్తూ, ‘‘అక్షరాల వెనకున్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం…’’ అనే క్లూని కూడా ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ పజిల్‌ను డీకోడ్ చేసే పనిలో నిమగ్నమైపోయారు.

Virupaksha Teaser: అందరి కళ్లు ‘విరూపాక్ష’ టీజర్ పైనే..!

కాగా, ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ పోస్టర్ పజిల్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఉగాది రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.