Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా.. | Vishwak sen about ashokavanalo arjuna kalyanam movie ott release date

Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..

తాజాగా విశ్వక్‌సేన్ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో విశ్వక్ మాట్లాడుతూ.. '' నా సినిమాని పెద్ద హిట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా..................

Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..

Vishwak Sen :  ఇటీవల గత కొన్ని రోజులుగా యువ హీరో విశ్వక్‌సేన్ వార్తల్లో నిలుస్తున్నాడు. మాస్ కా దాస్ అని పిలిపించుకునే విశ్వక్‌సేన్ ఇప్పటిదాకా అన్ని మాస్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ సారి కొత్తగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా’తో క్లాస్ సినిమాని కూడా ట్రై చేశాడు. ఈ సినిమా కోసం వీర లెవల్లో ప్రమోషన్స్ చేశాడు విశ్వక్‌సేన్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అది కాస్తా వివాదమవ్వడం, దానిపై చర్చ కోసం ఓ ఛానల్ కి ఇంటర్వ్యూకి వెళ్లి అక్కడ యాంకర్ తో గొడవ పెట్టుకోవడం, అది వైరల్ అవ్వడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడంతో విశ్వక్‌సేన్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారాడు.

Ira Khan : బికినిలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

 

వీటన్నిటితో సినిమాకి ప్రమోషన్ మరింత చేకూరి సినిమా కూడా మంచి విజయం సాధించింది. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఇటీవలే చేసుకున్నారు చిత్ర యూనిట్. తాజాగా విశ్వక్‌సేన్ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో విశ్వక్ మాట్లాడుతూ.. ” నా సినిమాని పెద్ద హిట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. కొంతమంది నా సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందో అంటూ పోస్టులు, వీడియోలు చేస్తున్నారు. దానివల్ల థియేటర్ కి వచ్చి చూసే వాళ్ళు తగ్గిపోతారు. ఓటీటీలో త్వరగానే వస్తది అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా నా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో నాకే తెలీదు. తెలిస్తే నేనే అఫీషియల్ గా చెప్తాను. అంతే కానీ ఇలాంటి పోస్టులు చేసి థియేటర్ కి వచ్చే వాళ్ళని చెడగొట్టకండి. ఆ పోస్టులని డిలీట్ చేయండి. థియేటర్ కి వచ్చి జనాల్ని సినిమా చూడనివ్వండి”అంటూ తెలిపారు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

×