Vishwak Sen: బాలీవుడ్‌లో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిన విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ఇప్పుడు బాలీవుడ్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Vishwak Sen: బాలీవుడ్‌లో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిన విశ్వక్ సేన్

Vishwak Sen Das Ka Dhamki Hindi Release Date Locked

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేయడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని విశ్వక్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Vishwak Sen: ఇద్దరు హీరోయిన్లతో మాస్ కా దాస్ రొమాన్స్.. మామూలుగా ఉండదట!

ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాగా, ఇప్పుడు బాలీవుడ్‌లో ధమ్కీ ఇచ్చేందుకు మాస్ కా దాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ పనులు ముగించుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Das Ka Dhamki: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న దాస్ కా ధమ్కీ.. ఎప్పుడంటే?

ఈ సినిమాలో అందాల భామ నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. రోహిణి మొల్లేటి, అజయ్, రావు రమేష్, హైపర్ ఆది, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.