vishwaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ కి కరోనా పాజిటివ్

యువ హీరో విశ్వక్‌సేన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విశ్వక్‌సేన్ తన సోషల్ మీడియాలో “నాకు కోవిడ్ -19 పాజిటివ్........

vishwaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ కి కరోనా పాజిటివ్

Vishwaksen Corona

vishwaksen :    గతంలో అన్ని సినీ పరిశ్రమలలోను చాలా మందికి కరోనా సోకింది. కొంతమంది కరోనాతో మరణించారు కూడా. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ కరోనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఇప్పుడు మూడో వేవ్ అంటూ వస్తుంది. ఒక పక్క అందరు వ్యాక్సిన్స్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా ఏదో ఒక రూపంలో వస్తూనే వుంది. మళ్ళీ గత కొన్ని రోజులుగా సెలెబ్రిటీలపై కరోనా పంజా విసురుతుంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం యువ హీరో మంచు మనోజ్ తనకి కరోనా సోకిందని తెలియచేసాడు. తాజాగా మరో యువహీరో కరోనా బారిన పడ్డాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామాదాస్, హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్‌సేన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Cinema : సినిమాలకి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ విధానం అమలు చేయాలి

విశ్వక్‌సేన్ తన సోషల్ మీడియాలో “నాకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ కి వెళ్ళిపోయాను. నా డాక్టర్ సలహాలు పాటిస్తున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వ్యాక్సిన్ లు వేసుకున్న తర్వాత కూడా కరోనా ఇలా వ్యాపించడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్క్ వేసుకుని సురక్షితంగా ఉండండి. మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు” అని పోస్ట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)