Waltair Veerayya : బాస్ పార్టీకి ముహూర్తం షురూ.. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, మూవీ మీద ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ నేడు ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

Waltair Veerayya : బాస్ పార్టీకి ముహూర్తం షురూ.. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్..

Waltair Veerayya : బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, మూవీ మీద ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ నేడు ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

Chiranjeevi : రాజకీయాలపై మరోసారి మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి

ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ’ని విడుదల చేసే తేదిని ప్రకటిస్తూ, ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో బాస్ లుంగీ కట్టులో ఊర మాస్ లుక్ కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాట నవంబర్ 23 సాయంత్రం గం.4:05 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. చిరు సూపర్ హిట్ మూవీ ముఠామేస్త్రి తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో మాస్ మూల విరాట్ గా దర్శనమివ్వనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌతేలా’ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Waltair Veerayya first single Boss Party Date fix

Waltair Veerayya first single Boss Party Date fix