బేర్‌తో కలిసి డేర్‌గా.. రజనీ స్టైల్ అదుర్సు కదూ!..

  • Published By: sekhar ,Published On : March 10, 2020 / 09:15 AM IST
బేర్‌తో కలిసి డేర్‌గా.. రజనీ స్టైల్ అదుర్సు కదూ!..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇన్ టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీ అంటే స్టైల్.. స్టైల్ అంటే రజనీ.. 70 వయసులో కూడా ఆయన గ్రేస్, ఎనర్జీ, నడకలో ఆ స్టైల్, తన మార్క్ మేనరిజమ్స్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. తాజాగా తన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజనీ.

డిస్కవరీ చానెల్‌లో టెలికాస్ట్ అయ్యే వరల్డ్ ఫేమస్ షో “మ్యాన్ వర్సెస్ వైల్డ్” లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కనిపించనున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ షో రజనీ మొట్టమొదటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. ఇదిగో ఇలా ఉండబోతుంది అంటూ సరికొత్త ప్రోమో రిలీజ్ చేసారు.

ప్రోమో మాత్రం స్టైలిష్‌గా సాలిడ్‌‌గా ఉంది. టీవీ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్‌ను సినిమా రేంజులో చూపిస్తున్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ సాహసాలు చేస్తూ కనిపించాడు. తన స్టైల్ వాకింగ్, కళ్లజోడో తిప్పుతూ పెట్టుకోవడం వంటివి కూడా చూపించారు ప్రోమోలో. ఈ గ్రాండ్ ఎపిసోడ్ మార్చి 23వ తేది సోమవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

Into The Wild With Bear Grylls And Superstar Rajinikanth - Promo

See Also | అదిరిందయ్యా మహేష్.. కొత్త బ్రాండ్.. కొత్త బిజినెస్..