ఓటేసిన పొట్టి మహిళ..జ్యోతి ఆమ్గే!

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 07:26 AM IST
ఓటేసిన పొట్టి మహిళ..జ్యోతి ఆమ్గే!

ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా జ్యోతి ఆమ్గే గిన్నిస్‌ రికార్డు ఎక్కారు ఎక్కింది. ఈమె పొడవు జస్ట్ 62.8 సెంటీమీటర్లు మాత్రమే అంటే రెండు ఫీట్లా 6 ఇంచులు అన్నమాట. రెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడి ఎత్తు కంటే కూడా తక్కువ. తన ఎముకల్లో ఎదుగుదల లేకపోవడంతో తాను ఎత్తు పెరగలేదు. అయితే తన తక్కువ ఎత్తు వల్ల జ్యోతికి కొన్ని టీవీ షోల్లో ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ అమెరికన్ హార్రర్ స్టోరీ లాంటి టీవీ షోల్లో జ్యోతి పాల్గొన్నది.

అయితే ఈ రోజు జ్యోతి ఆమ్గే(25) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ర్టలోని నాగ్ పూర్ లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా జ్యోతి ఆమ్గే తాను ఓటేసినట్లు ఓ ఫోటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం తన ఫొటో బాగా వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మీకు ఎన్ని పనులున్న ఓటు వేసిన తర్వాత మిగతా పనులను చేసుకోండి అని చెప్పారు.