Acharya: మెగా హీరోల కోసం యంగ్ టైగర్ రాక..!

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు హెల్పింగ్ సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. కరోనా తర్వాత బడా స్టార్స్ అంతా కలిసి ఇప్పుడు సినిమా గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Acharya: మెగా హీరోల కోసం యంగ్ టైగర్ రాక..!

Acharya

Acharya: తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు హెల్పింగ్ సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. కరోనా తర్వాత బడా స్టార్స్ అంతా కలిసి ఇప్పుడు సినిమా గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు మా సినిమా చూడండి అని కాకుండా అందరి సినిమాలు చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది ఇన్నాళ్ళూ లేదని కాదు.. అప్పుడప్పుడు ఒకరికి ఒకరు గతంలో కూడా సపోర్ట్ గా నిల్చునే వారు. అయినా సరే సపరేషన్ స్పష్టంగా కనిపించేది. కానీ ఇప్పుడు అంతా మారింది. ఒకరి కోసం ఒకరు అంటూ స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.

Mahesh Babu : మహేష్‌బాబుకు సర్జరీ.. షూటింగ్స్‌కి బ్రేక్.. ఆందోళనలో అభిమానులు

మెగా-నందమూరి కాంబినేషన్స్ అసలు సెట్ అవుతాయా అన్న డౌట్స్ బద్దలయ్యేలా ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ మల్టీస్టారర్ సెట్టైతే.. సినిమా ప్రమోషన్స్ లో కూడా అసలెప్పుడు కనిపించని బాలయ్య-బన్నీ స్టేజ్ కాంబినేషన్ రీసెంట్ గా సెట్టయింది. త్వరలో రాబోయే అల్లు అర్జున్ కోసం కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తాడని ఊహాగానాలు వస్తుండగానే.. ఇప్పుడు మరో క్రేజీ స్టేజ్ కాంబినేషన్ కూడా సెట్టవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అదే మెగా హీరోలతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టేజ్ పంచుకోనున్నాడట.

Raghu : లిక్కర్ బిజినెస్‌లోకి జబర్దస్త్ కమెడియన్

మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఆచార్య రాబోతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద భారీ అంచనాలను సెట్ చేసింది. ఇక, రాబోయే ట్రీట్స్ కూడా అంతకు మించి అనేలా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని ఇప్పుడు ఇండస్ట్రీ టాక్.

Bigg Boss : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

ఇది ఎంత వరకు నిజమన్నది తెలియదు కానీ.. ఈ క్రేజీ స్టేజ్ కాంబినేషన్ సెట్టయ్యేందుకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరణ్, తారక్ లకి ఆల్రెడీ మంచి బాండింగ్ ఉంది. కొరటాలతో అంతకు మించిన అనుబంధం కూడా ఉంది. పైగా తర్వాత సినిమా కూడా ఎన్టీఆర్ కొరటాలతోనే సిచేయనున్నాడు. సో తారక్ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. అదే నిజమైతే.. ఆర్ఆర్ఆర్ కి ప్రమోషన్ కలిసి వచ్చే అవకాశం ఉండగా ఫ్యాన్స్ లో మాత్రం పిచ్చ క్రేజ్ నెలకొనడం ఖాయం.