ది స్కై ఈజ్ పింక్ : ‘జిందగీ’ వీడియో సాంగ్

ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ది స్కై ఈజ్ పింక్’.. నుండి ‘జిందగీ’ వీడియో సాంగ్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 10:14 AM IST
ది స్కై ఈజ్ పింక్ : ‘జిందగీ’ వీడియో సాంగ్

ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ది స్కై ఈజ్ పింక్’.. నుండి ‘జిందగీ’ వీడియో సాంగ్ విడుదల..

ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ది స్కై ఈజ్ పింక్’.. అక్టోబర్ 11న విడుదల కానుంది. హాలీవుడ్‌లో క్వాంటికో సిరీస్, సినిమాలు, నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా హిందీలో నటించిన సినిమా.. అలాగే ‘దిల్ దఢ్‌ఖనే దో’ తర్వాత ఫర్హాన్, ప్రియాంక కలిసి నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం..

సోనాలి బోస్ దర్శకత్వంలో.. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ప్రియాంక చోప్రా కలిసి నిర్మించిన ‘ది స్కై ఈజ్ పింక్’ నుండి ‘జిందగీ’ వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రీతమ్ ట్యూన్, గుల్జార్ లిరిక్స్, ఆర్జిత్ సింగ్ వాయిస్ పాటకు ప్లస్ అయ్యాయి. విజువల్స్, క్యారెక్టర్ల ఎమోషన్స్ బాగున్నాయి.

Read Also : ఆయుష్మాన్ ఖురానా – ‘బాలా’ ట్రైలర్

చిన్న వయసులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో, డాక్టర్స్ బతకడమే కష్టమని చెప్పినా, పట్టుదలతో కష్టపడి, 15 ఏళ్లకే మోటివేషనల్ స్పీకర్‌గా, రచయితగా తన ప్రతిభను చాటుకున్న ఐషా చౌదరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయేషా క్యారెక్టర్‌లో జైరా నటించగా, ఆమె తల్లి అదితీ ఛౌదరీగా ప్రియాంక, తండ్రిగా ఫర్హాన్ నటించారు.