ఒక్క రేషన్ కార్డులో 68మంది.. ఉమ్మడి కుటుంబం కాదు..

ఒక్క రేషన్ కార్డులో 68మంది.. ఉమ్మడి కుటుంబం కాదు..

Ration

ఒక్క రేషన్ కార్డులో 68మంది ఉండడం అంటే.. అదేదో పెద్ద ఉమ్మడి కుటుంబం అనుకోవచ్చు.. కానీ 68 మంది సభ్యులతో కూడిన రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యులంతా ఒకరికి ఒకరు సంబంధ లేనివాళ్లు.. అసలు ఉన్నారో లేరో కూడా తెలీదు.. ఈ ఫ్రాడ్ బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఒకే రేషన్ కార్డులో మతాలకు అతీతంగా పేర్లు ఉండటంతో అనుమానం వచ్చింది.

హిందూ, ముస్లింలు ఒకే కార్డులో ఉండటంపై ఆరా తీయడంపై అసలు విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని మహువా SDO సందీప్‌ కుమార్‌ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విచారణ చేపట్టారు.

వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా.. ఒకే కుటుంబానికి, ఒకే రేషన్ కార్డుపై రెగ్యులర్‌గా ఏకంగా 38క్వింటాళ్ల ధాన్యం ఇస్తున్నట్లు కనిపించడంతో అవాక్కైన అధికారులు స్థానిక రేషన్‌ డీలర్‌ సంజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అధికారులు ధాన్యాన్ని రికవరీ చేసే పనిలోపడ్డారు.