Indore : కరెంటు స్తంభం ఎక్కిన పాము..తర్వాత, వీడియో వైరల్

సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.

Indore : కరెంటు స్తంభం ఎక్కిన పాము..తర్వాత, వీడియో వైరల్

Snake

10 Foot Snake : కరెంటు స్తంభం, ఇళ్లపై, వాటర్ ట్యాంకర్లపై మనుషులు, కొన్ని జంతువులు ఎక్కుతుంటాయి. అయితే..ఓ కరెంటు స్తంభంపై పాము ఎక్కంగా ఎవరైనా చూసుంటారా ? పాము కరెంటు స్తంభం ఎక్కడమేందీ ? వింత కాకపోతే అనుకుంటున్నారా ? కానీ..నిజంగానే ఎక్కింది. అయితే..అమాంతం హై ఓల్టేజ్ తో నిప్పులు చెలరేగాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రమాదంలో పాముకు తీవ్రగాయాలయ్యాయి. ఈ హృదయవిదారక ఘటన ఇండోర్ లో చోటు చేసుకుంది.

సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది. అయితే..ఒక్కసారిగా..బలమైన హై వోల్టేజ్ షాక్ తగిలి నిప్పులు చెలరేగాయి. ఆ భారీ విష సర్పం స్తంభం నుంచి అమాంతం కిందపడిపోయింది. నేల మీద నీరు, గడ్డి ఉండడంతో పాముకు పెద్ద ప్రమాదం కలగలేదు. తీవ్రంగా గాయపడింది. ఇదంతా స్థానికంగా ఉన్న వారు..వీడియో తీశారు. స్థానిక ప్రజలు స్నేక్ క్యాచ్ కు సమాచారం అందించారు.

Read More : Jerusalem ఒక్కసారిగా కుంగిన భూమి..గోతిలో పడిపోయిన కార్లు, వీడియో వైరల్