Tamil Nadu : తమిళనాడులో విషాదం.. కల్తీ మద్యం తాగి 13 మంది మృతి

కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.

Tamil Nadu : తమిళనాడులో విషాదం.. కల్తీ మద్యం తాగి 13 మంది మృతి

adulterated liquor

Adulterated Liquor : తమిళనాడులో విషాదం నెలకొంది. కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి చెందారు. విల్లుపురం జిల్లాలోని మరక్కాణంలో 9 మంది, చంగల్పట్టు జిల్లా మధురంతకంలో నలుగురు మరణించారు. మరో 30 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు. ఈ కేసులో పుదుచ్చేరి నుంచి అక్రమంగా కల్తీసారా తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమరన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Bihar : మద్యపాన నిషేధం ఉన్న బీహార్ లో.. కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

అతనితోపాటు మరో 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారు ఇండస్ట్రియల్ మిథనాల్ మిక్స్డ్ కల్తీ మద్యం సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి 50 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.