2000 Rupee Note: బ్యాంకుల్లో నేటి నుంచి 2వేల నోట్లు మార్చుకోవచ్చు.. ఒకేసారి ఎన్ని నోట్లు మార్చుకోవచ్చో తెలుసా?

ఈరోజు (మే23) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని బ్యాంకుల్లో రూ. 2వేల నోటు ఇచ్చి ఇతర నోట్లను పొందవచ్చు.

2000 Rupee Note: బ్యాంకుల్లో నేటి నుంచి 2వేల నోట్లు మార్చుకోవచ్చు.. ఒకేసారి ఎన్ని నోట్లు మార్చుకోవచ్చో తెలుసా?

2000 Rupee Note

2000 Rupee Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత శుక్రవారం రూ.2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీవద్ద రూ.2వేల నోటు ఉంటే బ్యాంకుల్లో, ఇతర దుకాణాల్లో మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు నుంచి రూ.2వేల నోట్ల డిపాజిట్, మార్పిడి ప్రక్రియ బ్యాంకుల్లో ప్రారంభం కానుంది. ఏ బ్యాంకుకు వెళ్లినా రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఎన్ని నోట్లు ఒకేసారి మార్చుకోవచ్చు.? ఎలాంటి ఫాం లేకుండా ఎన్ని రూ. 2వేల నోట్లతో కూడిన ఎంత సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు అనే విషయాలపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.

RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఈరోజు (మే23) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని బ్యాంకుల్లో రూ. 2వేల నోటు ఇచ్చి ఇతర నోట్లను పొందవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని సార్లుఅయినా 2వేల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఒక లావాదేవీలో 10నోట్లను మార్చుకొనేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో  లీడర్‌గా ఉన్న ఎస్‌బీఐ దాని పరిధిలోని అన్ని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఒకేసారి రూ.20వేల విలువ కలిగిన 2వేల నోట్లను ఎలాంటి పత్రాలు నింపడం, గుర్తింపు కార్డులు అవసరం లేకుండా నేరుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. మరోవైపు 50వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆర్బీఐ తెలిపింది.

RBI : 2 వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్‌ 30 దాకా టైముందన్న ఆర్బీఐ

2016లో నోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకుల్లో సొమ్ములేకపోవటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ పలు సూచనలు చేసింది. బ్యాంకుల్లో తగినంత సొమ్మును అందుబాటులో ఉంచాలని, వేసవి నేపథ్యంలో 2వేల నోట్లు మార్చుకొనేందుకు బ్యాంకుల వద్దకు వచ్చే ప్రజలకోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇదిలాఉంటే ఆభరణాల దుకాణాల్లో 50వేల వరకు క్యాష్ చెల్లింపులకు గుర్తింపు కార్డు సమర్పించాల్సిన పనిలేదు. కేవలం పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. 50వేల కంటే ఎక్కువగా 2లక్షల వరకు నగదుతో చెల్లించాలంటే పాన్ కార్డు, ఆధార్ వంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నట్లు బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

Beggar 2000 Rupees Notes : అతనో బిచ్చగాడు.. కానీ జేబు నిండా రూ.2 వేల నోట్ల కట్టలే..

ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. బ్యాంకుల వద్ద 2వేల నోట్లను మార్చుకొనేందుకు వెళ్లిన ప్రజలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులు కూడా ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని సూచించింది. అదేవిధంగా 2వేల నోట్లు మార్చుకొనేందుకు బ్యాంకుల వద్దకు వచ్చిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి పూర్తి డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.  వేసవి దృష్ట్యా బ్యాంకుల వద్ద వినియోగదారులు వేచిఉండేందుకు షెడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.