Corona Cases India : ఇండియాలో విజృంభిస్తున్న కరోనా..ఒక్కరోజులోనే 3 లక్షల 20 వేల కేసులు

కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్‌ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు.

Corona Cases India : ఇండియాలో విజృంభిస్తున్న కరోనా..ఒక్కరోజులోనే 3 లక్షల 20 వేల కేసులు

Corona Cases India

corona cases in India : కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్‌ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రతీ గంటకు వందమందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సెకండ్‌ వేవ్‌ ఎప్పుడు కంట్రోల్‌లోకి వస్తుందా.. ఈ కల్లోలం ఎప్పుడు ఆగుతుందా.. అని దేశమంతటా ఆందోళన నెలకొంది.

భారత్‌పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కేసులతో దేశంలో పరిస్థితి దారుణంగా తయారయింది. ఒక్కరోజులోనే దాదాపు 3 లక్షల 20 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే నిమిషానికి 222 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న 3లక్షల 50 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు, ఇవాళ కాస్త తగ్గాయి. అయితే ఒక్కరోజు కేసులు తగ్గినంతమాత్రాన దీన్ని ఉపశమనంగా భావించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ప్రతి మంగళవారం కేసుల సంఖ్య కాస్త తగ్గుతాయి. వీకెండ్‌ రోజుల్లో టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో … కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం కనిపిస్తోంది.

కేసుల్లోనే కాదు మరణాల్లో మాత్రం కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. పెరుగుతున్న మరణాల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా కరోనా మరణాలు 2 వేల మార్క్‌ను దాటాయి. 24 గంటల్లో కరోనాతో 2 వేల 760 మందికి పైగా చనిపోయారు. ఈ ఒక్క నెలలోనే ఇప్పటిదాకా కరోనాతో 34 వేల మందికి పైగా మరణించారు. గతేడాది కరోనా ఫస్ట్‌వేవ్‌లో అత్యధిక కేసులు నమోదైన సెప్టెంబర్‌లో 33 వేల మందికిపైగా మరణించగా.. ఇప్పుడు నెల పూర్తి కాకుండానే అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఏడు రోజుల్లోనే ఏకంగా 17,330 వేల మందికి పైగా కరోనాకు బలయ్యారు.

ప్రపంచంలో బ్రెజిల్‌ తప్ప మరే దేశంలోనూ ఈ నెలలో కరోనాతో ఇంత మంది చనిపోలేదు. బ్రెజిల్‌లో ఈ నెలలో ఇప్పటిదాకా 75 వేల మందికి పైగా మరణించారు. ఇప్పటికే ఒకరోజు అత్యధిక కేసుల విషయంలో అమెరికాను మించి పోయింది మనదేవం. కనీసం మరణాల్లోనైనా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉంది.