Rajasthan: రాజస్థాన్‌లో పశువులకు వింత వ్యాధి.. 18వేల మూగ జీవాలు మృతి

రాజస్థాన్ రాష్ట్రంలో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది. 15 జిల్లాల్లో ఈ వ్యాధి సోకి 18వేల మూగ జీవాలు మృతిచెందాయి. వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Rajasthan: రాజస్థాన్‌లో పశువులకు వింత వ్యాధి.. 18వేల మూగ జీవాలు మృతి

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది. 15 జిల్లాల్లో 4,24,188 మూగ జీవాలు ఈ వ్యాధి బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 18, 462 మూగ జీవాలు ఈ లంపీ స్కిన్ డిసీజ్ భారిన పడి మృతిచెందాయి. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూగ జీవాల మృతికి కారణమవుతున్న లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Breaking: చైర్మన్‭గా నియమిచిన కాసేపటికే రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్

లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు అవసరమైన మందులు టెండర్ లేకుండానే కొనుగోలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జంతువుల మధ్య వ్యాపించే ఈ వ్యాధిని మనమందరం కలిసి ఎదుర్కోవాలని అశోక్ గెహ్లాట్ అక్కడి ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి 1,79,854 మూగ జీవాలు కోలుకున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాధి భారిన పడి మరణించిన మూగ జీవాల మృతదేహాలను ప్రత్యేక నిబంధనల ప్రకారం ఖననం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

BF shocked of GF habit: ప్రియురాలు చేస్తున్న పని సీక్రెట్‭గా చూసి బిత్తరపోయిన ప్రియుడు

ప్రధానంగా ఈగలు, దోమల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఇది జ్వరం, చర్మంపై పొక్కులకు కారణమవుతుందని, మరణానికి కూడా దారి తీస్తుందని తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని అశోక్ గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. గోశాలల పరిశుభ్రతను పాటించాలని, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ, ఫాగింగ్ జరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. అయితే ఈ వ్యాధి అత్యధికంగా అజ్మీర్, సికార్, జుంజును, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో  ఉందని, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.