Cm Nitish : బీహార్ సీఎం ఇంట్లో 40 మందికి కరోనా

సీఎం నితీష్ కుమార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 40 మందికి కరోనా నిర్దారణ అయింది.

Cm Nitish : బీహార్ సీఎం ఇంట్లో 40 మందికి కరోనా

Cm Nitish

Cm Nitish : కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. గత ఐదు రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత వారం పదివేలకు దిగువన నమోదైన కేసులు.. ఈ వారం ప్రారంభం నుంచే పరుగులు పెడుతున్నాయి. కరోనా సామాన్య ప్రజలనే కాదు ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 10 మంది మంత్రులు కరోనా బారినపడ్డారు. ఇక ఇదిలా ఉంటే బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో బీహార్ క్యాబినెట్ లో నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

చదవండి : CM Nitish kumar : బీహార్ లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది : సీఎం నితీశ్ కుమార్  

ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంట్లోని సిబ్బందిలో 40 మందికి కరోనా సోకినట్లుగా అధికారులు నిర్దారించారు. నిన్నమొన్నటి వరకు బీహార్ రాష్ట్రంలో కరోనా తీవ్రత పెద్దగా లేదు. గత మూడు రోజులుగా కేసుల తీవ్రత పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక సీఎం కార్యాలయ సిబ్బందిని కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసుల తీవ్రత దృష్ట్యా మరో కొద్దీ రోజులపాటు సీఎంను మరో ఇంటికి షిఫ్ట్ చెయ్యాలని వైద్య సిబ్బంది సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాట్నా జిల్లాలోని మరో ప్రదేశంలో సీఎం నితీష్ బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

చదవండి : Corona Positive : ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా