PMGKAY : ఉచిత రేషన్ పంపిణీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది.

PMGKAY : ఉచిత రేషన్ పంపిణీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Pmgkay

5 Kg Free Foodgrains Scheme : ఉచిత రేషన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం గరీబ్ యోజన కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకాన్ని పొడిగించింది. 2022 మార్చి వరకు అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో అర్హులైన వారికి లబ్ది చేకూరనుంది. కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియచేశారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతొక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ మరో నాలుగు నెల పాటు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. దాదాపు 80 కోట్ల మంది లబ్దిదారులకు రేషన్ పంపిణీ జరుగుతోందని వెల్లడించారు.

Read More : Govt scrapage policy : పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ : కేంద్రం

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది. ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదంటూ..స్వయంగా కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు ఇటీవలే వెల్లడించారు. దీంతో రేషన్ పంపిణీ కంటిన్యూ జరుపుతారా ? లేదా ? అనే దానిపై పుకార్లు షికారు చేశాయి. 2021, నవంబర్ 24వ తేదీ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉచిత పంపిణీ పథకంపై చర్చించిన కేబినెట్..దీనిని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా..మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ…కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవం విశేషం.

Read More : Google Employees : గూగుల్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. నో వ్యాక్సిన్.. ఇంట్లోనే పనిచేస్తాం!

కరోనా కారణంగా దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమైపోయాయి. ప్రధానంగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం…గత సంవత్సరం పీఎం గరీబ్ యోజన కళ్యాణ్ అన్న యోజన పథకం తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు కొనసాగింది. అప్పటికీ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో…2020, జులై – నవంబర్ వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. అనంతరం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగింది. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఉచిత పంపిణీపై మరోసారి కేంద్రం సమీక్ష జరిపింది. 2021 మే – జూన్ వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత..మరో జులై నుంచి నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022, మార్చి వరకు పొడిగిస్తూ..కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.