Govt scrapage policy : పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ : కేంద్రం

పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు.

Govt scrapage policy : పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ : కేంద్రం

Govt Scrapage Policy

Govt scrapage policy  : పాత వాహనాన్ని వదుల్చుకుని కొత్త వాహనం కొనుక్కోవాలనుకునేవారికి కేంద్రం రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆలోచన శుభవార్త అని చెప్పాలి. పాత వాహనాలను తుక్కు (స్కాప్)కోసం ఇస్తే..వారి కొత్త వాహనం కొనుక్కుంటే వారికి పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నారు. జాతీయ వాహన తుక్కు విధానం కింద పాత వాహనాలను తుక్కుకు ఇచ్చి, కొత్త వాహనాలను కొనేటప్పుడు మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోందని ఆ దిశగా పలు చర్చలు కొనసాగాయని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. మంత్రి నితిన్ గడ్కరి దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే తొలి కేంద్రాన్ని గడ్కరీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఈ విధానంపై ఆర్థిక శాఖతో మాట్లాడుతానని తెలిపారు. ఈ కొత్త విధానంతో రీసైక్లింగ్ జరుగుతుందని..దీంతో ఆటోమొబైల్ పరిశ్రమలో కాంపోనెంట్‌ల ధర తగ్గుతుందన్నారు. కాగా ప్రభుత్వ అనుమతితో దీన్ని మారుతీ సుజుకి-టొయోట్సు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. స్క్రాపేజ్‌ విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ఆదాయం పెరుగుతుందని..అందుచేత ఇంకా ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చో ఆలోచించాలని జీఎస్టీ మండలిని గడ్కరీ కోరారు. కేంద్రం, రాష్ర్టాలకు రూ.40 వేల కోట్ల చొప్పున జీఎస్టీ ఆదాయం వస్తుందని చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3 నుంచి 4 పాత వాహనాల రీసైక్లింగ్‌, స్క్రాపేజ్‌ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని వివరించారు.

Read more : Old Vehicle : పాత వాహనం రోడ్డుపైకి వస్తే ఫైన్ కట్టాల్సిందే!

రానున్న రెండేళ్లలో దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే 200 నుంచి 300 కేంద్రాలు ఏర్పాటవుతాయని..ఆటోమొబైల్‌ రంగం వార్షిక టర్నోవర్‌ రూ.7.5 లక్షల కోట్లు అని, దాన్ని ఐదేండ్లలో రూ.15 లక్షల కోట్లకు పెంచాలన్నది తన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. రాష్ర్టాలు స్క్రాపేజ్‌ విధానంలో ప్రజలు కొనే కొత్త వాహనాలకు రోడ్డు పన్నులో 25 రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నది.
ఢిల్లీలో ప్రారంభమైన స్క్రాపేజ్‌ కేంద్రానికి ఏడాదికి 24 వేల పాత వాహనాలను తుక్కుగా మార్చి, రీసైకిల్‌ చేసే సామర్థ్యం ఉంది. రూ.44 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పాత వాహనాలను శాస్త్రీయ పద్ధతిలో తుక్కుగా మార్చడానికి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తామని యాజమాన్యం తెలిపింది.

కొత్త స్క్రాపింగ్ విధానం..
15 ఏళ్లు నిండిన వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడంలో విఫలమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని ఈ కొత్త స్కాపింగ్ విధానం ప్రతిపాదించింది. అలాగే..వ్యాపారాలకు సంబంధించిన వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేషన్, ఫిట్‌నెస్ పరీక్షల కోసం పెరిగిన ఫీజులు ప్రారంభ రిజిస్ట్రేషన్ తేదీ నుండి 15 సంవత్సరాల తర్వాత వర్తించవచ్చు. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనం ఫిట్‌నెస్ పరీక్షకు అర్హత ఉండదనీ..ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందలేకపోతే..వారి రిజిస్ట్రేషన్ (డి-రిజిస్ట్రేషన్) రద్దు చేయబడుతుందని ప్రతిపాదించబడింది. ప్రైవేట్ వాహనాల కోసం, పెరిగిన రీ-రిజిస్ట్రేషన్ రుసుము రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ నుండి 15 సంవత్సరాల తర్వాత వర్తిస్తుంది.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు,15 సంవత్సరాల కంటే పాత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల స్వయంప్రతిపత్తి గల అన్ని వాహనాలను నమోదు చేయాలని ప్రతిపాదించబడింది.

Read more : Telangana : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు..అతివేగానికి 24

2012-2012 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పాత వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమని..వాటిని వదిలించుకోవడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం గుర్తించబడిందని తెలిపారు. ప్రభుత్వం 2001 నుండి దీనిపై కసరత్తు చేస్తోంది. కాలుష్యం,రోడ్లపై రద్దీని తగ్గించే ప్రయత్నంలో, పాత, కలుషితమైన వాహనాలను తొలగించే విధానాన్ని క్యాబినెట్ ఆమోదం కోసం ఫిబ్రవరి 2020లో క్యాబినెట్ సెక్రటేరియట్‌కు పంపారు.

ఈ విధానంలో 51 లక్షల లైట్ మోటారు వాహనాలు (LMV) 20 సంవత్సరాల కంటే పాతవాటితో పాటు మరో 34 లక్షల తేలికపాటి మోటారు వాహనాలు (LMVలు) 15 సంవత్సరాల కంటే పాతవి ఉన్నాయని కేంద్ర మంత్రి అంచనా వేశారు. ఈ విధానంలో 1 లక్ష మధ్యస్థ మరియు భారీ మోటారు వాహనాలు కూడా ఉంటాయి. ఇది 15 ఏళ్లు పైబడినది మరియు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా నడుస్తోంది.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ..కొత్త స్క్రోపింగ్ విధానం కాలుష్యాన్ని నియంత్రించటానికి ఇదో విధానమని తెలిపారు. ఇది దాదాపు రూ. 10,000 కోట్ల కొత్త పెట్టుబడులను సృష్టిస్తుందని అన్నారు. ఈ విధానంలో పాత వాహన యజమానులకు వారి వాహనాలను స్క్రాప్‌కు పంపడంతో పాటు స్క్రాపింగ్ సర్టిఫికేట్ కూడా అందించబడుతుందని తెలిపారు.

Read more : వాహనాలపై ఇష్టమొచ్చిన రాతలు రాసుకుంటే జేబులు ఖాళీయే..

ఈ కొత్త పాలసీ ప్రకారం.. పాత కార్లను స్క్రాప్ చేయడానికి పాత వాహనాల పాత షోరూమ్ ధరలో 4% నుండి 6% వరకు ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది. అదనంగా.. ప్రైవేట్ వాహనాలకు 25% మరియు వాణిజ్య వాహనాలకు 15% వరకు రహదారి పన్నును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించవచ్చు. స్క్రాపింగ్ సర్టిఫికేట్‌లకు బదులుగా కొత్త వాహనాల కొనుగోలుపై 5% తగ్గింపును అందించాలని వాహన తయారీదారులకు సూచించబడింది. స్క్రాపింగ్ సర్టిఫికేట్ జారీ చేసిన సందర్భంలో కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ రుసుమును మాఫీ చేయవచ్చని పాలసీ పేర్కొంది.