పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోండి…ప్రభుత్వానికి 625మంది మేధావుల విజ్ణప్తి

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2019 / 01:00 PM IST
పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోండి…ప్రభుత్వానికి 625మంది మేధావుల విజ్ణప్తి

పౌరసత్వ సవరణ బిల్లు(CAB)ను ఉపసంహరించుకోవాలని 625మంది రైటర్లు,ఆర్టిస్టులు,మాజీ జడ్జిలు,మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగవిరుద్ధం,విభజించేదిగా,వివక్షతో కూడినదిగా ఈ బిల్లును వారు అభివర్ణించారు.

ఈ బిల్లును ఉపసంహరిచుకోవాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేసినవారిలో నయన్ తార సెహగల్,అరుంధతీరాయ్,అమితవ్ ఘోష్ వంటి రైటర్లు,టీఎమ్ క్రిష్ణ,సుధీర్ పట్వర్థాన్,నీలిమా షేక్ వంటి ఆర్టిస్టులు, అపర్ణ సేన్,నందితా దాస్ వంటి ఫిల్మ్ మేకర్లు,రామచంద్రగుహ వంటి చరిత్రకారులు, అరుణ్ రాయ్,తీస్తా సెటల్వాడ్,హర్ష్ మందర్ వంటి యాక్టివిస్టులు,యోగేంద్ర యాదవ్,ఏపీ షా,నందిని సుందర్ వంటి రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు.

లింగం, కులం, మతం, తరగతి, సమాజం లేదా భాషతో సంబంధం లేకుండా భారతదేశపు రాజ్యాంగం సమానత్వం యొక్క ప్రాథమికాలను నొక్కి చెబుతుందని మేధావులు తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లు(CAB) లేదా జాతీయ పౌర ముసాయిదా(NRC) దేశవ్యాప్తంగా ప్రజలకు చెప్పలేని బాధలను తెస్తుందని, ఇది భారత రిపబ్లిక్ యొక్క స్వభావాన్ని ప్రాథమికంగా మరియు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని వారు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. మరోవైపు ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి.