Corona Treatment : 50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్లు ఖర్చు.. అయినా దక్కని ప్రాణం

10 కాదు 20 కాదు.. ఏకంగా 50 ఎకరాల భూమి అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం పోయి

Corona Treatment : 50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్లు ఖర్చు.. అయినా దక్కని ప్రాణం

Corona Treatment

Corona Treatment : 50 ఎకరాలను అమ్మేశారు. ఏకంగా రూ.8 కోట్లు వైద్య చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం కాపాడుకోలేకయపోయారు కుటుంబసభ్యులు.

మధ్యప్రదేశ్ కు చెందిన రైతు ధర్మజయ్ కు గతేడాది మే 2న కరోనా సోకింది. ఊపిరితిత్తుల సమస్యతో రైతు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రోజుకు రూ.3 లక్షల చొప్పున ఖరీదైన ట్రీట్ మెంట్ ఇచ్చారు. అలా 8 నెలలు చికిత్స అందించారు. అంతేకాదు లండన్ నుంచి ప్రముఖ డాక్టర్లనూ తీసుకొచ్చారు. వారితో ట్రీట్ మెంట్ ఇప్పించారు. అయినా అతని ఆరోగ్యం బాగుపడలేదు. ఇటీవలే మరణించాడు.

EPFO : ఖాతాదారులకు గుడ్ న్యూస్..లక్ష వరకు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే

రేవాకు చెందిన రైతు ధరమ్ జయ్ సింగ్ 2021 ఏప్రిల్ లో కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులను ఆయనను రేవాలోని ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. తర్వాత మెరుగైన చికిత్స కోసం మే 18న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో సుమారు 8 నెలల పాటు చికిత్స అందించారు. ఇందుకోసం ఏకంగా రూ.8కోట్లు ఖర్చు చేశారు కుటుంబసభ్యులు. అయినా ఆయన ప్రాణం దక్కకపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

దేశంలో ప్రముఖ డాక్టర్లతో ధరమ్ కు చికిత్స అందించారు. అయితే ధరమ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బాగా వ్యాపించింది. అదే సమయంలో కిడ్నీ విఫలమైంది. మెదడులో రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమంచి చనిపోయాడు. సుమారు 8 నెలలకు పైగా చికిత్స అందించారు. ధరమ్ జయ్ సింగ్ చాలా రోజులు వెంటిలేటర్ పై ఉన్నాడు. అపోలో ఆసుపత్రిలో ఎక్స్ మో మెషిన్ లో ఉంచారు. ఈ మెషిన్ కు గాను ఆసుపత్రి యాజమాన్యం రోజుకు రూ.లక్ష వసూలు చేసింది. దీనికి తోడు మందులు, డాక్టర్ల ఫీజులు, ఇతర ఖర్చులతో కలిపి రోజుకు సూమారు రూ.3లక్షల బిల్లు అయ్యింది. ధరమ్ జయ్ సింగ్ వైద్య చికిత్స కోసం కుటుంబసభ్యులు ఏకంగా 50 ఎకరాల భూమిని అమ్మేశారు.

దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వైద్యులతో ధరమ్ కి చికిత్స అందించారు. లండన్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లూ వచ్చారు. ఆన్ లైన్ లో పలు దేశాల వైద్యులను సంప్రదించారు. లండన్ డాక్టర్ల సూచన మేరకు ధరమ్ ను ఎక్మో మెషిన్ పై 8 నెలల పాటు ఉంచారు.

Lose Weight : సన్నగా మారాలనుకునే వారు ఇలా చేసి చూడండి!

రైతు ధరమ్ జయ్ సింగ్ కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారికి వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉంది. అది పూర్వికుల నుంచి వచ్చింది. ధరమ్ సోదరుల్లో ఒకరు న్యాయవాది. మరొకరు సోషల్ యాక్టివిస్ట్. ధరమ్ జయ్ సింగ్ ప్రగతిశీల రైతు. రాష్ట్రపతి నుంచి సన్మానం అందుకున్నారు. స్ట్రాబెర్రీ, గులాబీ సాగుతో గుర్తింపు పొందారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2021 జనవరి 26న ఓ కార్యక్రమంలో రైతు ధరమ్ జయ్ ను సత్కరించారు. సామాజిక సేవలో నిమగ్నమై ఉండగా అదే సమయంలో ఆయన కరోనా బారినపడ్డారు.