EPFO : ఖాతాదారులకు గుడ్ న్యూస్..లక్ష వరకు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే
అకౌంట్ హోల్డర్లు రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని...ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి క్రమంలో..ఖర్చులు...

Rs 1 Lakh From EPFO Account : ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు గుడ్ న్యూస్. అకౌంట్ హోల్డర్లు రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని…ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి క్రమంలో..ఖర్చులు అధికమౌతున్నాయి. వైద్య ప్రయోజనాల కోసం సభ్యులు ఆ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా అడ్వాన్స్ గా తీసుకోవచ్చని వెల్లడించింది. అయితే..కొన్ని నిబంధనలకు మాత్రం లోబడి ఉండాల్సి ఉంటుందని…కొన్ని షరతులను విధించింది.
Read More : New YEZDI bikes: భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన yezdi బైక్స్
ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని అనుకుంటే..అంతకుముందుగానే డబ్బులను విత్ డ్రా చేసుకొనే అవకాశం కల్పించింది. డబ్బులను ఉద్యోగి యొక్క అకౌంట్ లేదా..ఆసుపత్రి బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి కానీ..సీజీహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.
Read More : AAP Punjab : సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోవచ్చు..ఫోన్ నెంబర్ కేటాయించిన ఆప్
విత్ డ్రా ఎలా ?
– అధికారిక వెబ్ సైట్ (EPFO)..www.epfindia.gov.in లాగిన్ కావాలి.
– ఆన్ లైన్ సేవలను క్లిక్ చేయాలి.
– 31, 19, 10c, 10D ఫారమ్ లను పూర్తి చేయాలి.
– దీనిని ధృవీకరించడానికి బ్యాంకు అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంట్రీ చేయాలి.
Read More : Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్
– ప్రోసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్ ను క్లిక్ చేయాలి.
– డ్రాప్ డౌన్ మెను నుంచి ఫారమ్ 31ని సెలక్ట్ చేసుకోవాలి.
– అసలు డబ్బు ఎందుకు అవసరం వచ్చిందో అక్కడ చెప్పాలి.
– ఆసుపత్రికి సంబంధించిన బిల్లు కాపీని అప్ లోడ్ చేయాలి.
– తర్వాత..ఇంటి చిరునామ..తదితర వివరాలను పొందుపరిచి..సబ్మిట్ పై క్లిక్ చేయాలి.