AAP Punjab : సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోవచ్చు..ఫోన్ నెంబర్ కేటాయించిన ఆప్

2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా..ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం...

AAP Punjab : సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోవచ్చు..ఫోన్ నెంబర్ కేటాయించిన ఆప్

Aap Punjab

AAP CM Face In Punjab : పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న ఆప్…వినూత్నంగా ఆలోచిస్తూ..ప్రజల్లోకి వెళుతోంది. ఇప్పటికే తాము పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ..ప్రచారాన్ని ముమ్మరం చేపట్టింది. తాజాగా..పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని..ఇందుకు తాము ఓ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. సీఎంగా ఎవరైతే బెటర్ అని ఆలోచించి…7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలన్నారు. వాట్సాప్ లో మేసేజ్ ద్వారా అభిప్రాయం చెప్పే అవకాశం ఉందన్నారు.

Read More : Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా..ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక విధంగా చెప్పాలంటే..దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేలు కూడా ఆప్ వైపుకు మొగ్గు చూపడం విశేషం. ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని జోస్యం చెప్పాయి.

Read More : Attack Sikh Taxi Driver in US:అమెరికాలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి..తలపాగా లాగి పడేసి అసభ్యపదజాలంతో దూషణ

సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ…ఆప్ లోనే ఆయన పట్ల…అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో..కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకోవడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి..అధికారంలోకి వచ్చింది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.