Old Woman Raped : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. లిఫ్ట్‌ ఇస్తానని అఘాయిత్యం

మధ్యప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

Old Woman Raped : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. లిఫ్ట్‌ ఇస్తానని అఘాయిత్యం

RAPE

old woman was raped : దేశంలో మహిళలకు రక్షణకు లేకుండా పోయింది. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా స్త్రీలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు పసి పిల్లలు మొదలుకొని వృద్ధులను సైతం వదలం లేదు. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. జబల్ పూర్ నుంచి వచ్చిన ఓ వృద్ధురాలు షాహ్ దోల్ రైల్వే స్టేషన్ లో దిగింది. అక్కడి నుంచి తన బంధువు గ్రామమైన ఆంత్రాకు వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో డ్రైవర్ వృద్ధురాలిని ఆంత్రా గ్రామానికి సమీపంలోని మెయిన్ రోడ్డు పైనే వదిలేసి వెళ్లాడు.

Student Gang Raped : బాయ్ ఫ్రెండ్ ఎదుటే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. చంపేస్తామని బెదిరించి అఘాయిత్యం

అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలిని బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన బైక్ పై ఎక్కించుకున్నాడు. మార్గంమధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తిరిగి ఆమెను రోడ్డుపై విడిచి పెట్టి బైకర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు.