Boy Apology To Teacher: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కోపంగా ఉన్న టీచర్‌ను ముద్దుపెట్టి కూల్ చేసిండు.. వీడియో వైరల్

చిన్న పిల్లలు చాలా అమాయకంగా, ముద్దుగా ఉంటారు. వారి చేష్టలు అందరికీ నవ్వులు తెప్పిస్తాయి. చిన్న పిల్లల ఫన్నీ, క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Boy Apology To Teacher: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కోపంగా ఉన్న టీచర్‌ను ముద్దుపెట్టి కూల్ చేసిండు.. వీడియో వైరల్

Boy Apology To Teacher

Boy Apology To Teacher: చిన్న పిల్లలు చాలా అమాయకంగా, ముద్దుగా ఉంటారు. వారి చేష్టలు అందరికీ నవ్వులు తెప్పిస్తాయి. చిన్న పిల్లల ఫన్నీ, క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు పాఠశాలలో కోపంగాఉన్న తన టీచర్‌ని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. దగ్గరకువెళ్లి ఎంతబతిమాలినా టీచర్ బాలుడ్నిక్షమించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ బుడతడు అందరి మనసులు గెలుచుకునే పనిచేశాడు. ఆ టీచర్‌సైతం ఆ చిన్నారి చేసిన పనికి ఫిదా అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. క్లాస్‌లో తన టీచర్ దగ్గర ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. అయితే.. టీచర్ కోపంగా తనదగ్గరకు వచ్చిన బుడ్డోడికి ‘ నేను నీతో మాట్లాడను’ అంటూ చెప్పింది. దీంతో ఆ పిల్లవాడు టీచర్ ను తనతో మాట్లాడేందుకు ఒప్పించడం ప్రారంభించాడు. ఇంకెప్పుడూ నేను క్లాస్ రూంలో అల్లరి చేయను అని చెబుతూ టీచర్ ను బుజ్జగించ సాగాడు.. నువ్వు పదేపదే అలా చెబుతావు.. మళ్లీ తప్పు చేస్తావు అంటూ టీచర్ మందలించింది. దీంతో పిల్లవాడు టీచర్ భుజాలపై చేయివేసి బతిమిలాడుకుంటూ టీచర్ కు ముద్దు పెట్టాడు. టీచర్ సైతం చిరునవ్వులతో పిల్లవాడితో మరోసారి తన బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టించుకుంది. అనంతరం కోపంతగ్గించుకున్న టీచర్ చిన్నారి బుగ్గపై ముద్దుపెట్టడం వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోలో చిన్నారి ప్రవర్తన ముద్దుగా ఉండటంతో నెటిజన్లు లైక్ చేస్తున్నారు. ట్విటర్ లో పోస్టుచేసిన ఈ వీడియోను ఇప్పటివరకు వేలాదికిపైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు వీడియోపై ఫన్నీ, క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్.. నేను ఈ పిల్లవాడిని చూసి అసూయపడుతున్నాను అంటూ రాశాడు.