Disabled Girl Raped : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..దివ్యాంగ బాలిక‌పై అత్యాచారం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోరం జరిగింది. ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. దివ్యాంగ బాలిక‌పై ఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

Disabled Girl Raped : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..దివ్యాంగ బాలిక‌పై అత్యాచారం

disabled girl raped

Updated On : August 10, 2022 / 7:30 PM IST

disabled girl raped : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోరం జరిగింది. ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. దివ్యాంగ బాలిక‌పై ఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షియోపూర్‌లో చోటు చేసుుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి..దివ్యాంగ బాలిక‌ను గ్రామ స‌మీపంలోని నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

Girl Raped : స్కూల్‌కు వెళ్తున్న బాలికపై అత్యాచారం..పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు

ఆ బాలిక ఎంత‌సేప‌టికి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు గాలించారు. గ్రామ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో బాలిక నిందితుడితో క‌నిపించింది. నిందితుడిని చిత‌క‌బాదిన కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు అప్ప‌గించారు. నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేపట్టారు.