Uttar Pradesh: స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లకు ఆ గ్రామంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్లు వచ్చాయి

స్వాతంత్ర్యానికి ముందు జంతువులతో నివసించే వాళ్లు. అందరికీ తాగునీరు ఒకే చోట ఉండేవి. తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్లి పాలు అమ్ముకుని వచ్చేటప్పుడు డబ్బాల్లో నీళ్లు పెట్టుకుని వచ్చేవారు

Uttar Pradesh: స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లకు ఆ గ్రామంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్లు వచ్చాయి

Updated On : September 8, 2023 / 4:03 PM IST

Lahuriya Dah: ఆకాశంలో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలు ఇప్పటికీ కరెంటు, రోడ్డు, తాగునీరు వంటి సౌకర్యాలు లేకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. భౌగోళిక కారణాల వల్ల కొన్ని ప్రాంతాలు ఈ వసతులకు దూరంగా ఉంటే.. పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు కొన్ని. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి ఇప్పటికీ రోడ్డు లేదు. కొద్ది రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన గర్భిణీ.. సరైన సమయంలో వైద్య సదుపాయం అందక మృతి చెందింది.

Marimuthu : మొన్న రమేష్.. ఇవాళ మరిముత్తు.. జైలర్ సినిమా విలన్ గ్యాంగ్ నిజంగానే మరణిస్తున్నారు..

ఇక తాజా ఒక విషయానికి వస్తే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు అవుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గ్రామానికి తాజాగా నల్లా నీళ్లు వచ్చాయి. ఆ గ్రామం మొట్టమొదటిసారిగా నల్లా ద్వారా తాగునీటి సౌకర్యాన్ని పొందింది. మిర్జాపూర్‌లోని లాహురియా దాహ్ గ్రామ ప్రజలకు బహుశా ఇప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. వారంతా ఇప్పుడు స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. ఇంతకు ముందు అక్కడి ప్రజలు తమ నీటి అవసరాల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూసేవారు. 1,200 మంది జనాభా ఉన్న కొండ గ్రామం సమీపంలోని ఆ గ్రామం.. నీటి బుగ్గపై ఆధారపడింది. ఇది వేసవిలో ఎండిపోతుంది. ఆ తర్వాత వారికి ట్యాంకర్లే దిక్కు.

G-20 Summit: జీ20 సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే దేశాధినేతకు ఢిల్లీలో ఘన స్వాగతం

“స్వాతంత్ర్యానికి ముందు జంతువులతో నివసించే వాళ్లు. అందరికీ తాగునీరు ఒకే చోట ఉండేవి. తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్లి పాలు అమ్ముకుని వచ్చేటప్పుడు డబ్బాల్లో నీళ్లు పెట్టుకుని వచ్చేవారు. అది కూడా చాలా కష్టంగా ఉండేది. అయితే గత 25-30 ఏళ్లుగా గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీరు చేరడం మొదలైంది. ట్యాంకర్‌లో నీళ్లు వచ్చిన తర్వాత నీటి కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు’’ ఇదీ గ్రామానికి చెందిన ఓ స్థానికుడు చెప్పిన విషయం.

Revanth Reddy : నేను పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగింది : రేవంత్ రెడ్డి

ఇక తాజాగా నల్లా నీటిని ఆ జిల్లా కలెక్టర్ దివ్య మిట్టల్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, “లాహురియా దాహ్‌కు నీటి పైప్‌లైన్‌ను తీసుకురావడం చాలా కష్టమైంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, దశాబ్దం క్రితం పని మధ్యలోనే ఆగిపోయింది. జల్ జీవన్ మిషన్‌లో కూడా ఈ గ్రామాన్ని చేర్చలేదు. ఈ మిషన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించారు. అయితే ప్రత్యేక చొరవ తీసుకుని పనులు ప్రారంభిస్తే ఆగస్టులో పూర్తయింది’’ అని అన్నారు.