టీవీ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మృతి

  • Published By: madhu ,Published On : August 13, 2020 / 09:13 AM IST
టీవీ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మృతి

ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. త్యాగికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సెక్టార్ 16, వసుందర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇతను టీవీల్లో జరిగే చర్చల్లో పాల్గొంటారు.

దీనిపై కౌశాంబీలో ఉన్న యశోద ఆసుపత్రి సీవోవో సునీల్ మాట్లాడుతూ…తనకు ఆరోగ్యం బాగా లేదని, చెస్ట్ లో నొప్పి వస్తుందని త్యాగి సాయంత్రం 6 నుంచి 6.15 మధ్య తమకు తెలియచేశారని, ఈ సమయంలో లైవ్ లో చర్చ జరుగుతుందని కుటుంబసభ్యులు తెలియచేశారని చెప్పారు.

అనంతరం ఆసుపత్రిక తీసుకరాగా..ప్రొటోకాల్ ప్రకారం..CPR, ALS పరీక్షలు చేయడం జరిగిందన్నారు. కానీ శ్వాస, పల్స్ చూపంచకపోవడంతో మరణించినట్లు ప్రకటించామన్నారు.

త్యాగికి ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేవన్నారు. ఇతని కుటుంబం 10 సంవత్సరాల నుంచి తమ ఆసుపత్రికి వస్తుంటారన్నారు. ఇటీవలే ఆయనకు కొలెస్ట్రాల్ సమస్యలున్నట్లు గుర్తించామని, కానీ..తక్కువగా ఉన్నాయన్నారు.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు త్యాగి భార్యతో మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. బబ్బర్ షేర్ ను పార్టీ కోల్పోయిందని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అతనికున్న ప్రేమ తమకు ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు.