Tamil Nadu polls : అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

Tamil Nadu polls : అన్నాడీఎంకే  అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

AIADMK releases first list of six candidates, CM Palaniswami to contest from Edappadi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది అన్నాడీఎంకే. ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఈ లిస్ట్ లో సీఎం,డిప్యూటీ సీఎం,మత్యశాఖ మంత్రి,న్యాయశాఖ మంత్రి,మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్,ఎస్ తెన్మోజి పేర్లు ఉన్నాయి.

సీఎం పళనిస్వామి.. తన సొంత జిల్లా సేలంలోని ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా,డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం..తన సొంతజిల్లా థేనీలోని భోధినాయకన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక సీనియర్ నేతలు జయకుమార్(మత్యశాఖ మంత్రి)రోయపురం,సీవీఈ షణ్ముగం(న్యాయశాఖ మంత్రి)విల్లుపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక,ఎమ్మెల్యేలు ఎస్సీ షణ్ముగనాథన్.. శ్రీవైగుండం, ఎస్ తెన్మోజి.. నీలకొట్టై నియోజవకవర్గం(రిజర్వ్డ్) నుంచి పోటీ చేయనున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది.

234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్-6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అన్నాడీఎంకే బహిషృత నాయకురాలు,దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతూ బుధవారం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రధానపోటీ డీఎంకే-అన్నాడీఎంకే మధ్యేనని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(MNM)తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న వేళ దాని ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది చూడాలి.