Sleep Champion Triparna: హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షలు గెలుచుకుంది.. భారత ‘స్లీప్ ఛాంపియన్‌’‌గా నిలిచిన త్రిపర్ణ

హాయిగా నిద్రపోయినందుకు రూ.5 లక్షల బహుమతి గెలుచుకుంది ఒక యువతి. 100 రోజులపాటు, రోజూ కనీసం తొమ్మిది గంటలు నిద్రపోయి ఈ బహుమతి గెలుచుకుంది. ఆమె పేరు త్రిపర్ణా చక్రవర్తి. ఇంతకీ ఈ పోటీ ఎందుకంటే...

Sleep Champion Triparna: హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షలు గెలుచుకుంది.. భారత ‘స్లీప్ ఛాంపియన్‌’‌గా నిలిచిన త్రిపర్ణ

Sleep Champion Triparna: హాయిగా నిద్రపోయినందుకు రూ.5 లక్షల బహుమతి గెలుచుకుంది త్రిపర్ణా చక్రవర్తి అనే యువతి. పరుపుల తయారీ సంస్థ ‘వేక్‌ఫిట్’ ఈ ఏడాది ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ ప్రోగ్రాం నిర్వహించింది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు 100 రోజులు, రోజుకు 9 గంటలపాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోవాలి.

Indians Use Antibiotics: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్‌లో అజిత్రోమైసిన్

5.5 లక్షల మంది అభ్యర్థుల నుంచి 15 మందిని నిర్వాహకులు ఎంపిక చేశారు. వీరికి ఆ సంస్థ తయారు చేసిన పరుపులు, స్లీప్ ట్రాకర్ అందించారు. ఎవరింట్లో వాళ్లు నిద్రపోవాలి. అలా అందరికంటే ఎక్కువగా, ఆటంకం లేకుండా నిద్రపోయిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అలా ఈ పోటీలో మొత్తం నలుగురు ఫైనల్ చేరారు. వారిలో త్రిపర్ణా చక్రవర్తి విజేతగా నిలిచింది. వారి నిబంధనల ప్రకారం.. 95 శాతం ప్రమాణాల్ని అందుకుని, అందరికంటే ఎక్కువగా నిద్రపోయింది త్రిపర్ణ. దీంతో త్రిపర్ణను విజేతగా ప్రకటించారు. అంతేకాదు.. ఆమెను స్లీప్ ఛాంపియన్‌గా ప్రకటిస్తూ రూ.5 లక్షల నగదు బహుమతి కూడా అందించారు.

Gujarat: దంపతుల మధ్య గొడవ.. చిన్నారితో సహా 12వ అంతస్థు నుంచి దూకి జంట ఆత్మహత్య

ఫైనల్ చేరిన మిగతా ముగ్గురకి కూడా రూ.1 లక్ష చొప్పున స్టైఫండ్ అందజేశారు. హాయిగా, ఎలాంటి ఆటంకం లేకుండా గంటల తరబడి నిద్రపోయే అలవాటుంటే మీరు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన సీజన్-3 పోటీ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి బహుమతి కూడా డబుల్ చేశారు. ఈ సీజన్‌లో విజేతగా నిలిస్తే రూ.10 లక్షల బహుమతి అందించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.