ఒకే కుటుంబంలో 66 ఓట్లు: డిమాండ్లు తీరిస్తేనే ఓట్లేస్తాం

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 11:01 AM IST
ఒకే కుటుంబంలో 66 ఓట్లు: డిమాండ్లు తీరిస్తేనే ఓట్లేస్తాం

ఓట్లకు నోట్లిచ్చే నేతలున్నారు కానీ, సమస్యకు పరిష్కారం చూపే నాయకులే లేకుండా పోయారు. ఒకే కుటుంబంలో 60కి పైగా ఓట్లున్నా ఆ ఇంటి గోడు ఎవరికీ వినిపించడం లేదు. 98ఏళ్ల వయస్సున్న ఆ ఇంటి పెద్ద ఈ సారి సమస్య తీరితేనే కానీ, ఓటు వేయమని భీష్మించుకుని కూర్చున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో బహ్రెచా గ్రామంలో ఒకే కుటుంబంలో 66 ఓట్లు ఉన్నాయి. కుటుంబానికి పెద్దగా 98ఏళ్ల రామ్‌ నరేశ్‌ భూర్టియా వ్యవహరిస్తున్నారు. 82 మంది ఉన్న ఫ్యామిలీలో 66 మందికి ఓటు హక్కు ఉంది. కాగా ఆదివారం (మే 12)న ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 

ఆ కుటుంబంలోని ఓటర్లంతా ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేయబోతుండటం మరో విశేషం. ఇప్పటివరకు వారికి పక్కా ఇల్లే లేదు. పూరి గుడిసెలోనే ఉంటారు. వారుండే చిన్నపాటి పూరిల్లు పైనుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళ్తున్నాయని.. ఇల్లు కట్టుకోవడం సమస్యగా మారిందని వాపోయారు. 

ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడిగేందకు వచ్చిన నేతలందరికి తమ సమస్య తెలియజేసినా హామీలు మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోయాక ఎవ్వరు పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు రామ్ నరేశ్. ఇలా తాము ఎన్నిసార్లు మోసపోవాలి? అందుకే ఈ సారి తమ సమస్య పరిష్కించాకే ఓటేస్తామని రామ్‌ నరేశ్‌ నొక్కి బుతున్నారు.

ఇంట్లో ఉండే 82మందికీ రోజుకు 15 కిలోల గోధుమ పిండితో రొట్టెలు తయారు చేస్తారు. వాటిలో వండే కూర కోసం  20 కిలోల కూరగాయాలు ఖర్చవుతాయట.  వ్యవసాయం మీదనే ఆధారపడి ఈ పెద్ద కుటుంబంలో ఇద్దరు మాత్రం ముంబైలో ఉద్యోగం చేస్తారట. తమలాగానే దేశం అంతా కలిసి మెలిసి ఐక్యతగా ఉండాలని రామ్ నరేశ్ భూర్టియా ఆకాంక్షిస్తున్నారు.