ముస్లింలు భయపడాల్సిన పని లేదు : CABపై అమిత్ షా

లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 07:10 AM IST
ముస్లింలు భయపడాల్సిన పని లేదు : CABపై అమిత్ షా

లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ

లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదని షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రాత్మకమైనదన్నారు. ఈ బిల్లుతో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారని చెప్పారు. శరణార్థుల హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని తేల్చి చెప్పారు. 

ఈ బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు షా హితవు పలికారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదన్నారు. సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని షా అన్నారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల అపోహలు తొలగిస్తామని వెల్లడించారు. భారత్ లో నివసిస్తున్న ముస్లింలు దేశ పౌరులే అని, భారతీయ ముస్లింలు భయపడాల్సిన పని లేదని షా చెప్పారు.

రాజ్యసభకు CAB:
* పౌరతస్వ సవరణ బిల్లు బీజేపీ మేనిఫెస్టోలో భాగం
* దశాబ్దాలుగా శరణార్థులకు భారత్ లో అన్యాయం జరుగుతోంది
* ముస్లిం శరణార్థులందరికీ భారత్ ఆశ్రయం కల్పించలేదు
* పౌరసత్వ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
* CAB కేవలం శరణార్థుల కోసమే
* దశాబ్దాలుగా శరణార్థులకు భారత్ లో అన్యాయం జరుగుతోంది
* CAB కు ప్రజల ఆమోదం ఉంది
* ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వం
* శరణార్థుల హక్కులను కాపాడతాం
* ఇక్కడ నివసిస్తున్న ముస్లింలు భారత పౌరులే