Azaan: ర్యాలీలో ప్రసంగిస్తుండగా మోగిన అజాన్.. కాసేపు మౌనంగా ఉన్న అమిత్ షా

మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‭ పర్యటనలో ఉన్న అమిత్ షా.. బుధవారం బారాముల్లాలోని షౌకత్ అలీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. దగ్గరలో ఉన్న మసీదు నుంచి ఆయనకు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటని స్టేజి మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలను అడిగారు. వారు అజాన్ అని సమాధానం ఇచ్చారు

Azaan: ర్యాలీలో ప్రసంగిస్తుండగా మోగిన అజాన్.. కాసేపు మౌనంగా ఉన్న అమిత్ షా

Azaan: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‭లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తుండగా దగ్గరలో ఉన్న మసీదు నుంచి ఆజాన్ శబ్దం వినిపించింది. అంతే, అమిత్ షా మధ్యలోనే తన ప్రసంగాన్ని నిలిపివేసి ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అర్థగంట పాటు సాగిన ప్రసంగంలో ఇలా అజాన్ కోసం ఐదు నిమిషాల సమయాన్ని అమిత్ షా కేటాయించడం గమనార్హం.

మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‭ పర్యటనలో ఉన్న అమిత్ షా.. బుధవారం బారాముల్లాలోని షౌకత్ అలీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. దగ్గరలో ఉన్న మసీదు నుంచి ఆయనకు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటని స్టేజి మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలను అడిగారు. వారు అజాన్ అని సమాధానం ఇచ్చారు. అంతే, ఒక్కసారిగా తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ఇలా ఐదు నిమిషాల పాటు ప్రసంగించకుండా మౌనంగా నిలబడ్డారు అమిత్ షా.

ఇక ర్యాలీలో ఉన్న ప్రజల నుంచి అమిత్ షాకు జేజేలు వచ్చాయి. ఆయనకు జిందాబాద్ కొడుతూ పొగడ్తలు కురిపించారు. అజాన్ ముగిసిన అనంతరం కూడా ‘‘ఇప్పుడు నేను మాట్లాడొచ్చా లేదా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడొచ్చా?’’ అని ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా అన్నారు. అయితే ఈ ర్యాలీకి ముందుగా నిర్ణయించిన సమయం కంటే అమిత్ షా కాస్త ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి ఈరోజు ఉదయమే ఆయన అక్కడికి చేరుకోవాలి. కానీ సాయంత్రం నాటికి చేరుకున్నారు. దీంతో అమిత్ షా మినహా ఇతర నేతలెవరూ మాట్లాడకుండానే ర్యాలీ ముగిసింది.

Jammu Kashmir: పాకిస్తాన్‭తో శాంతి చర్చలపై అమిత్ షా ఏమన్నారంటే?