మోడీని మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : February 14, 2020 / 11:03 AM IST
మోడీని మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన కేజ్రీవాల్

తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(51). మొన్నటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో ఆదివారం జరిగే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోడీ వ్యతిరేకులంతా హాజరవుతారని అందరూ ఇప్పటివరకు భావించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు,రాజకీయ నాయకులు ఎవ్వరినీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించట్లలేదని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. 

ఢిల్లీ ప్రజలు మాత్రమే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని ఆప్ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వంపై మరోసారి నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలతో కలిసి కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాయ్ తెలిపారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరిని ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించామని ఆమ్ ఆద్మీ పార్టీలో నెం.2గా ఉన్న మనీష్ సిసోడియా గురువారం ప్రకటించారు.

ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70స్థానాల్లో ఆప్ 62సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కేవలం 8స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. మా ఢిల్లీ ముద్దు బిడ్డ అంటూ కేజ్రీవాల్ కు దేశరాజధాని ప్రజలు గంపగుత్తుగా ఓట్లు వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 67సీట్లను ఆప్ సాధించిన విషయం తెలిసిందే.  

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!