ఢిల్లీలో మార్కెట్లు మూసివేస్తాం…కేంద్రం అనుమతి కోరిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : November 17, 2020 / 02:54 PM IST
ఢిల్లీలో మార్కెట్లు మూసివేస్తాం…కేంద్రం అనుమతి కోరిన కేజ్రీవాల్

Arvind Kejriwal Seeks To Shut Delhi Markets దేశ రాజ‌ధానిలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్య‌ను అదుపులో ఉంచాలంటే మార్కెట్ల‌ను మూసివేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట్ లుగా మారిపోయాయని, క‌రోనా కేసులను తగ్గించేందుకు కొన్ని రోజులపాటు మార్కెట్లను మూసివేసేందుకు అనుమతించాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని కేజ్రీవాల్ తెలిపారు.

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించ‌డం లేద‌ని,ఇప్పటికే ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజీ దాటేసిందని నిన్నే ఆ రాష్ట్ర మంత్రి స‌త్యేంద్ర జైన్ వెల్ల‌డించిన విషయం తెలిసిందే.



https://10tv.in/vasan-eye-care-founder-am-arun-passes-away-in-chennai-suspicious-death-case-filed/
ఇవాళ(నవంబర్-17,2020)ఆన్ లైన్ మీడియా ద్వారా కేజ్రీవాల్ మాట్లాడుతూ…ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్ర‌భుత్వానికి ఓ వినతి పంపిస్తున్నామ‌ని, ఒక‌వేళ అవసరమైతే, కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మార్కెట్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు కేజ్రీ తెలిపారు. కోవిడ్ ఆంక్ష‌ల‌ను పాటించ‌ని మార్కెట్లు..లోక‌ల్ కోవిడ్-19 హాట్ స్పాట్ లుగా మారుతున్నాయ‌ని సీఎం చెప్పారు. అంతేకాకుండా, వివాహ కార్యక్రమాలకు అనుమతించే వారి సంఖ్యను కూడా తగ్గించాలని చూస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.



ఢిల్లీ హాస్పిట‌ళ్ల‌లో 750 ఐసీయూ బెడ్స్ పెంచినందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి కేజ్రీవాల్ థ్యాంక్స్ చెప్పారు. వైర‌స్‌ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వ ఏజెన్సీల‌న్నీ రెండింత‌లు ప‌నిచేస్తున్నాయ‌ని, కానీ కోవిడ్‌19 నివార‌ణ‌లో ప్ర‌జలు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టాన్సింగ్ కూడా పాటించాల‌ని సీఎం కోరారు.

ఢిల్లీలో కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 4.89 ల‌క్ష‌ల‌ు దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు 7,600 మంది వైర‌స్‌తో మ‌ర‌ణించారు.