Arthur Road Jail : ఆర్యన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తో పాటు ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

Arthur Road Jail : ఆర్యన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు

Aryan Khan

Aryan Khan COVID-19 : డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తో పాటు ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల వరకు వీరు క్వారంటైన్ లో గడిపిన సంగతి తెలిసిందే. 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. నిందితులందరూ ఆర్ధర్ రోడ్డులో జైలులో ఉన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర నిందితులు ఉండే సాధారణ బ్యారక్ నంబర్ 01కు అధికారులు మార్చనున్నారు. ముంబై సెషన్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను విచారించనుంది. గతంలో విచారణకు వచ్చిన అనంతరం కోర్టు గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ 7 రోజుల క్వారంటైన్ ను పూర్తి చేశాడని,  నెగటివ్ రావడంతో సాధారణ బ్యారక్ కు మార్చనున్నట్లు ఆర్థర్ రోడ్ జైలు అధికారులు వెల్లడించారు.

Read More : Vijayadasami : విజయదశమి రోజు పాలపిట్టని చూస్తే భవిష్యత్తు బంగారుమయమేనా?

జైలులో ఉన్న నిందితులకు బయటవి లేదా ఇంట్లో తయారు చేసే ఆహారం అనుమతించబడదు. ఆర్యన్ జైలు ఆహారం తినలేదని, జైలు క్యాంటిన్ నుంచి కొనుగోలు చేసిన బిస్కట్ లే తింటున్నాడని తెలుస్తోంది. 2021, అక్టోబర్ 02వ తేదీన క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించినట్లు, ఇందులో డ్రగ్స్ వాడారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు నిర్ధారించారు. షిప్ పై దాడి చేసి..కొంతమందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వారిని ప్రశ్నించిన అనంతరం ఆర్యన్ ఖాన్, అర్భాజ్ మర్చంట్, ధమేచాతో పాటు మరో ఐదుగురిని అక్టోబర్ 03వ తేదీన అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మాదకద్రవ్యాల కేసులో 20 మంది వరకు NCB అరెస్టు చేసింది.

Read More : Vijay Devarakonda : బట్టలు విప్పేస్తున్న వీడియో షేర్ చేసిన అర్జున్ రెడ్డి

మరోవైపు… 2021, అక్టోబర్ 14వ తేదీ గురువారం ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఆర్యన్‌ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు NCB కోర్టుకు తెలిపింది. తమ విచారణలో ఈ విషయం బహిర్గతమైనట్లు పేర్కొంది. అయితే పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని స్పష్టం చేసింది. అయితే డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు తెలిపింది.