Vijayadasami : విజయదశమి రోజు పాలపిట్టని చూస్తే భవిష్యత్తు బంగారుమయమేనా?

తెలంగాణా, ఒరిస్సా,కర్ణాటక, బీహార్ రాష్ట్రాలు తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించాయంటే ఆపక్షికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పాలపిట్ట చూడటానికి ముచ్చటగొలిపేలా ఉంటుంది.

Vijayadasami : విజయదశమి రోజు పాలపిట్టని చూస్తే భవిష్యత్తు బంగారుమయమేనా?

Palapitta

Vijayadasami : విజయదశమి పండుగకు, పాలపిట్టకు ప్రత్యేకమైన అనుబంధ ఉంది. తరతరాలుగా దసరా పండుగ రోజున చాలా మంది పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది. దీనికి పురాగాణ గాధల్లో అనేక కధనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రావణాసురుడిని చంపేందుకు వెళ్లిన శ్రీరాముడికి విజయదశమి నాడు పాలపిట్ట ఎదురవుతుంది, ఆనాడు రాముడు దానిని శుభశకునంగా భావించాడని అంటుంటారు. పాండవులు అజ్ఝాత వాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించటంతో ఆతరువాత కాలంలో వారు ఏంచేసినా విజయాలేకలిగాయన్న మరో కధనం కూడా చెబుతుంటారు.

చాలా మంది ఈ పక్షిని పరమశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే దసర పండుగ రోజున ఈ పక్షిని చూస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో దసరా పండుగ రోజున పాలపిట్టను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆరోజున పాలపిట్ట వారి కంటికి కనిపిస్తే ఇక రానున్న రోజుల్లో తాము ఏపనిచేసిన విజయం తప్పకుండా సిద్ధిస్తుందని బలంగా నమ్ముతారు.తెలంగాణా ప్రాంతం వాసులు దసర పండుగ రోజున జమ్మిచెట్టు, పాలపిట్టను తప్పకుండా చూడాల్సిందే.

తెలంగాణా, ఒరిస్సా,కర్ణాటక, బీహార్ రాష్ట్రాలు తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించాయంటే ఆపక్షికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పాలపిట్ట చూడటానికి ముచ్చటగొలిపేలా ఉంటుంది. నీలం, పసుపు రంగుల కలబోతలో చూడటానికి ఎంతో అందంగా కలఫుల్ గా కనిపించే ఈ పాలపిట్ట చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ఎకో ఫ్రెండ్లీ పక్షిగా పేరుగాంచింది.

పాలపిట్ట మనశ్శాంతికీ ప్రశాంతతకు, కార్యసిద్ధికీ సంకేంగా అంతా నమ్ముతారు. పాండవులు జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలకు సంవత్సరం పాటు ఇంద్రుడు పాలపిట్ట రపంలో కాపలాకాశాడని పురాణగాధలు చెబుతున్నాయి. ఎవరైనా ఆ చెట్టు మీద దాచిన ఆయుధాలను చూస్తే వారికంటికి అవి శవంలా, విషసర్పాలుగా కనిపిస్తాయనీ, ఎవరైనా వాటిని తాకేందుకు ప్రయత్నిస్తే అప్పుడు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వారిని తరిమికొడతాడట. అందుకే దసరారోజు పాలపిట్టను చూడాలని అంతా తహతహలాడుతుంటారు.