మానవత్వం అంటే ఇదే: హిందూ ఫ్రెండ్ కోసం దీక్ష విరమించాడు

  • Published By: vamsi ,Published On : May 12, 2019 / 03:07 PM IST
మానవత్వం అంటే ఇదే: హిందూ ఫ్రెండ్ కోసం దీక్ష విరమించాడు

హిందూ ముస్లీం అంటూ విభేదాలు సృష్టిస్తూ కొందరు సమాజంలో కలహాలు సృష్టిస్తుంటే.. మనుషుల మధ్య మానవత్వం మతం కంటే ఎక్కువగా ఉంది అనే ఘటన అసోంలో జరిగింది. అసోంలోని మంగలోదోయ్‌కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటాడు. అదే హస్పిటల్‌లో తన ఫ్రెండ్ తపోష్ గొగోయ్‌ అనారోగ్యంతో చేరాడు. తపోష్ గొగోయ్‌కి ఆపరేషన్ చేయాలని తెలిపారు డాక్టర్లు. అందుకు బీ పాజిటివ్ బ్లడ్ అవసరం అయింది. అదే సమయంలో హస్పిటల్‌లో బ్లడ్ అందుబాటులో లేకపోవడంతో ఫ్రెండ్ కోసం పలావుల్లా అహ్మద్ బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చాడు.

బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా, పగటిపూట ఆహారం తీసుకోకూడదు. అయితే ఫ్రెండ్ కోసం బ్లడ్ ఇచ్చిన అహ్మద్ దీక్షను విరమించాడు. పలావుల్లా అహ్మద్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మొదట మానవత్వం, ఆ తర్వాతే కులం, మతం అంటున్నాడు అహ్మద్.