August New Rules : చార్జీల బాదుడు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

ఆగస్టు 1 వచ్చేస్తోంది. కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆగస్ట్ 1 రావడంతోపాటు కొత్త రూల్స్ కూడా తెస్తోంది. ఒకటో తేదీ నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కువగా భారం పడనుంది.

August New Rules : చార్జీల బాదుడు.. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

August New Rules

August New Rules : ఆగస్టు 1 వచ్చేస్తోంది. కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆగస్ట్ 1 రావడంతోపాటు కొత్త రూల్స్ కూడా తెస్తోంది. ఒకటో తేదీ నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కువగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకోనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటి? మనల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయి?

సెలవు రోజుల్లోనూ వేతనం, పెన్షన్, ఈఎమ్ఐ చెల్లింపులు:
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసింది. దీంతో ఈ సేవలు ఇక ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక నుంచి సెలవు రోజుల్లో కూడా వేతనాలు, పెన్షన్ వంటివి కరెక్ట్ టైమ్ కి వస్తాయి. అంతేకాదు విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, మ్యూచువల్ ఫండ్స్, సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లోనూ జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24*7 అందుబాటులో ఉంటాయి.

సాధారణంగా ఆదివారం సహా ఇతర బ్యాంక్ హాలిడేస్ వంటివి వస్తే.. ఆ రోజున వేతనాలు రావు. కొన్ని కంపెనీలు ముందే శాలరీలు చెల్లిస్తే.. మరికొన్ని తర్వాతి పని దినం రోజున డబ్బులు చెల్లిస్తుంటాయి. పెన్షన్లకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే ఇకపై హాలిడేస్‌తో నిమిత్తం లేకుండా వేతనాలు, పెన్షన్, డివిడెంట్ వంటివి పొందొచ్చు.

ఏటీఎం చార్జీల బాదుడు: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్బీఐ. ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి.

ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు ఆగస్టు 1 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ICICI చార్జీల మోత:
ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. ఆ బ్యాంకు ఖాతాదారులకు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల ( ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భించనున్నట్లు వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీలు, ఏటీఎం ఇంట‌ర్‌ ఛేంజ్‌, చెక్‌ బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుంచి మార‌నున్నాయి.

సవరించిన ఛార్జీలు..
∙ ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో(ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్) మొద‌టి 3 లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేత‌ర) ఉచితం.
∙ మెట్రో న‌గ‌రాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో మొద‌టి 5 లావాదేవీలు ఉచితం.
∙ ఉచితం అయిపోయాక.. ప్రతీ ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేత‌ర లావాదేవీకి రూ.8.50 వ‌సూలు.
∙ హోం బ్రాంచ్‌లో న‌గ‌దు లావాదేవీ ప‌రిమితి నెలకు రూ.1ల‌క్ష వరకు ఉచితం. లక్ష దాటితే ప్రతి రూ.వెయ్యికి రూ.5 ఛార్జీ వసూలు. ఇది క‌నిష్ఠంగా రూ.150కు లోబ‌డి ఉంటుంద‌ని బ్యాంక్ తెలిపింది.
∙ నాన్ హోమ్ బ్రాంచ్ వ‌ద్ద రోజుకు రూ.25వేల వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. రూ.25వేల పైన ప్రతీ రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. క‌నీసం రూ. 150కి లోబ‌డి ఉంటుంది.
∙ థ‌ర్డ్‌ పార్టీ లావాదేవీల ప‌రిమితి రూ. 25వేలుగా నిర్ణయించారు. రోజూకు రూ.25వేల ప‌రిమితి వ‌ర‌కు లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25వేల ప‌రిమితికి మించి న‌గ‌దు లావాదేవీలు అనుమ‌తించరు.
∙ ఒక నెల‌లో మొద‌టి 4 లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత రూ.1000 లావాదేవీకి రూ.5 ఛార్జీ వసూలు చేస్తారు. క‌నీసం రూ.150కి లోబ‌డి ఉంటుంది.
∙ ఒక సంవత్సరంలో తీసుకున్న 25 లీవ్స్ చెక్ బుక్‌కి ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత అదే ఏడాది 10 లీవ్స్ చెక్ బుక్ కి రూ.20 వ‌సూలు చేస్తారు.