Congress Protest : కాంగ్రెస్ దేశవ్యాప్త పోరు.. డప్పులు కొట్టాలి, గంటలు మోగించాలి

బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌ డీజిల్‌పై భారీగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు సూర్జేవాలా. 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 రూపాయల 20 పైసలు...

Congress Protest : కాంగ్రెస్ దేశవ్యాప్త పోరు.. డప్పులు కొట్టాలి, గంటలు మోగించాలి

Congress (1)

Beat Drums And Ring Bells : కాంగ్రెస్‌ వ్యూహం మార్చింది. బీజేపీపై దేశవ్యాప్తంగా పోరుకు సిద్ధమైంది. పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా సమరశంకం పూరించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారం రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అధిక ధరలకు నిరసనగా ఈ నెల 31న గురువారం ఉదయం 11గంటలకు దేశ ప్రజలంతా తమ ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ సిలిండర్లు ప్రదర్శిస్తూ.. డప్పులు కొడుతూ గంటలు మోగించాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

Read More : Sher Bahadur Deuba : ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో నేపాల్‌ ప్రధాని పర్యటన.. వారణాసి సందర్శన!

బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌ డీజిల్‌పై భారీగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు సూర్జేవాలా. 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 రూపాయల 20 పైసలు.. డీజిల్‌పై రూ.3 రూపాయల 46 పైసలు ఉండేదని వివరించారు. గడచిన 8 ఏళ్లలో డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 531 శాతం, పెట్రోలుపై ఎక్సైజ్ డ్యూటీ 203 శాతం పెరిగిందన్నారు.

Read More : Congress : సమరమే అంటున్న కాంగ్రెస్.. దేశవ్యాప్త నిరసనలు

మరోవైపు…సంస్థాగత ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రిపేర్‌ అవుతోంది. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో.. సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు.. రాష్ట్రాల ఇంచార్జ్‌లు హాజరైన ఈ సమావేశంలో.. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేసే దిశగా కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇక.. కేంద్రంపై యుద్ధం చేయాలని కాంగ్రెస్‌ నేతలు తీర్మానించారు. పోరాటాల ద్వారానే అధికారంలోకి రావాలని యోచిస్తోంది హస్తం పార్టీ. అందుకు దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న ధరల పెరుగుదలను ఆయుధంగా చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్‌. ధరల పెరుగుదలపై కేంద్రంపై యుద్ధం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటించనుంది కాంగ్రెస్‌ పార్టీ.