Sher Bahadur Deuba : ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో నేపాల్‌ ప్రధాని పర్యటన.. వారణాసి సందర్శన!

Sher Bahadur Deuba : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) భారత్‌లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ పర్యటించనున్నారు.

Sher Bahadur Deuba : ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో నేపాల్‌ ప్రధాని పర్యటన.. వారణాసి సందర్శన!

Sher Bahadur Deuba Nepalese Pm To Visit Varanasi During His India Visit From April 1 3

Sher Bahadur Deuba : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) భారత్‌లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యూపీలోని వారణాసిని ప్రధాని దేవుబా సందర్శించనున్నారు. అధికార సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌ 2న ప్రధాని నరేంద్ర మోదీతో షేర్ బహదూర్ దేవుబా సమావేశం కానున్నారు.

ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, వ్యాపారం, ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశ ప్రజల అనుసంధానం, నేపాల్‌-భారత్‌ మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. 2021 జూలైలో నేపాల్‌ ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా మరోసారి ఎన్నికయ్యారు. రెండోసారి ప్రధానిగా పదవిని చేపట్టిన తర్వాత దేవుబా భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది.

Sher Bahadur Deuba Nepalese Pm To Visit Varanasi During His India Visit From April 1 3 (1)

Sher Bahadur Deuba Nepalese Pm To Visit Varanasi During His India Visit From April 

గతంలో నాలుగు సార్లు ఆ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భారత్‌లో పర్యటించారు. 2017లో చివరిసారిగా దేవుబా భారత్ లో పర్యటించారు. భారత్‌, నేపాల్‌ మధ్య ఎప్పటినుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అందులో భాగంగానే ఇరు దేశాల అధినేతలు ఇరుదేశాల్లో సందర్శిస్తుంటారు. దేశ ప్రధానులు మాత్రమే కాదు.. భారత్‌, నేపాల్‌ ఆర్మీ జనరల్స్‌ కూడా ఇరు దేశాల్లో పర్యటిస్తుంటారు. అప్పుడు ఇరుదేశాల జనరల్‌ ర్యాంక్‌తో వారిని ప్రత్యేకంగా గౌరవించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

Read Also : Nepals PM visit Bharath : భారత పర్యటనకు నేపాల్ కొత్త ప్రధాని..ఇరు దేశాల మధ్యా మళ్లీ స్నేహం బలపడేనా?