Bengaluru Airport : రూ. 40 లక్షల వాచ్ కోసం..విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు

స్క్రీనింగ్ ప్రాసస్ లో చోరికి గురయితే..ఏం చేస్తారని అతను ప్రశ్నించాడు. అలా ఏమీ జరగదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది...

Bengaluru Airport : రూ. 40 లక్షల వాచ్ కోసం..విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు

Rolex

Remove Rolex Watch : విమానం ఎక్కడానికి వచ్చాడు. ఎక్కడానికంటే ముందు తనిఖీలు చేస్తారనే సంగతి తెలిసిందే. అందరిలాగే అతడిని తనిఖీలు చేస్తున్నారు. కానీ..అతడు మాత్రం ఓ వస్తువు తీయాలని కోరితే..నో చెప్పాడు. అధికారులు ఎంత చెప్పినా..వినిపించుకోలేదు. చేతికి ఉన్న వాచ్ అస్సలు తీయనంటే తీయనన్నాడు. ఎందుకంటే…ఆ వాచ్ ఖరీదు చాలా కాస్ట్లీ అంట. అందుకే అది తీయడానికి ఓప్పుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసింది.

Read More : Minister KTR: నల్లగొండలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఢిల్లీకి వెళ్లేందుకు బెంగూళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం లగేజీ చెక్ చేసే ప్లేస్ కు వచ్చాడు. బ్యాగులతో పాటు..వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారనే సంగతి తెలిసిందే. తనిఖీ నిమిత్తం ధరించిన వాచ్ ను తీసి ట్రేల్ పెట్టాలని చెప్పారు సిబ్బంది. అయితే..వాచ్ చాలా ఖరీదైందని..రొలెక్స్ వాచ్..దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని..ఇది తీయనని ఖరాఖండిగా చెప్పాడు. తీయాలని..వారు..తీయనని ఆ ప్రయాణీకుడు. ఇలా కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read More : GST Council : విభజన చట్టం, పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తాం – ఏపీ మంత్రి బుగ్గన

స్క్రీనింగ్ ప్రాసస్ లో చోరికి గురయితే..ఏం చేస్తారని అతను ప్రశ్నించాడు. అలా ఏమీ జరగదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతోందని ఎంత చెప్పినా వినిపించుకోలేదని, చివరకు అతడిని పక్కను నిలబెట్టామన్నారు ఓ అధికారి. తనికీ ప్రక్రియ పూర్తయితేనే…విమానం ఎక్కేందుకు అనుమతినిస్తాం..లేకపోతే లేదు అని చెప్పడంతో వాచ్ తీశాడన్నారు. స్ర్కీనింగ్ పూర్తి చేసిన అనంతరం లోనికి పంపించామన్నారు.