Bhabanipur bypoll : బీజేపీ vs టీఎంసీ, మమత గెలుస్తారా ?

పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ బైపోల్‌ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. బెంగాల్‌లో సీఎం పీఠంపై క్లారిటీ ఇచ్చే ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

Bhabanipur bypoll : బీజేపీ vs టీఎంసీ, మమత గెలుస్తారా ?

Mamata

Bhabanipur bypoll : పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ బైపోల్‌ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. బెంగాల్‌లో సీఎం పీఠంపై క్లారిటీ ఇచ్చే ఉపఎన్నికల పోలింగ్‌ స్టార్ట్ అయ్యింది. 2021, సెప్టెంబర్ 30వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ఘనవిజయం సాధించినప్పటికి.. నందిగ్రామ్‌ నుంచి మమత ఓడిపోయారు. అయినప్పటికి ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ ఉపఎన్నికలో ఆమె గెలిస్తేనే.. సీఎంగా కొనసాగనున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ.. ప్రియాంక టిబ్రేవాల్‌ను దింపింది. సీపీఎం నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ బరిలో ఉన్నారు.

Read More : Huzurabad By Election : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ? బై పోల్‌‌ను లైట్‌‌గా తీసుకుందా ?

ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌ అక్కడ ఓటును కూడా నమోదు చేసుకున్నారు. గురువారం అంతా అక్కడే ఉండనున్నారు
ప్రశాంత్ కిశోర్‌. భవానీపూర్‌ నియోజకవర్గంలో పోలింగ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ. ఓటింగ్‌ జరిగే పోలింగ్‌ కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఎన్నికల కోసం అధికారులు 287 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి బూత్‌లో సగం సెక్షన్‌, ముగ్గురు జవాన్లు, కేంద్ర బలగాలను మోహరించనున్నారు. కోల్‌కతా పోలీసు అధికారులు బూత్‌ల వెలుపల భద్రత ఏర్పాట్లు చూడనున్నారు.

Read More : BAJAJ CHETAK : మరోసారి భారీగా ధర పెంపు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

భవానీపూర్‌ వ్యాప్తంగా 38 చోట్ల పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. 22 సెక్టార్‌ మొబైల్‌, తొమ్మిది హెవీ రేడియో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 13 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్‌ను మోహరించనున్నాయ్‌. ఉప ఎన్నిక కోసం నలుగురు జాయింట్ పోలీస్ కమిషనర్లు, 14 మంది డిప్యూటీ కమిషనర్లు, సమాన సంఖ్యలో అసిస్టెంట్ కమిషనర్లను నియమించినట్లు తెలిపింది ఈసీ. భవానీపూర్‌తో పాటు జంగీపూర్‌, సంసర్‌గంజ్‌లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. ఓట్ల ఫలితాలు అక్టోబర్‌ 3న విడుదలకానున్నాయి.