పద్దతిగా రావాలి : ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్,టీషర్టు వేసుకోవద్దు  

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 05:49 AM IST
పద్దతిగా రావాలి : ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్,టీషర్టు వేసుకోవద్దు  

బీహార్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నతాధికారులు,ఉద్యోగులందరూ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుని ఆఫీసులకు రావద్దంటు  ప్రభుత్వ కార్యరద్శి మహాదేశ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు సాధారణమైన బట్టలు అంటే ఫార్మల్స్ మాత్రమే వేసుకుని ఆఫీసుకు రావాలని ఉత్తర్వుల్లో సూచించింది.

చాలా మంది ఉద్యోగులు  జీన్స్ లు, టీషర్టు వేసుకుని ఆఫీసులకు వస్తున్నారనీ..ఇవి ఆఫీస్ పనిచేసే వాతావరణానికి తగినవి కాదని తెలిపారు. కాబట్టి  ఉద్యోగులంతా ఫార్మల్ డ్రెస్ లు వేసుకుని రావాలని సూచించింది.
 
ఇటీవల కాలంలో ఉద్యోగులందరూ జీన్స్, టీ షర్టులు ధరించి కార్యాలయానికి రావడం వల్లే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయ వాతావరణం, పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.