రూల్స్ మాకేనా..మీకులేవా : సీటు బెల్టు పెట్టుకోని పోలీసుల‌కు చుక్కలు చూపిన జనం 

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 05:51 AM IST
రూల్స్ మాకేనా..మీకులేవా : సీటు బెల్టు పెట్టుకోని పోలీసుల‌కు చుక్కలు చూపిన జనం 

ట్రాఫిక్ రూల్స్ కేవలం సామాన్య ప్రజలకేనా? పోలీసులకు వర్తించవా? కొత్త వాహన చట్టం వచ్చిన తరువాత ట్రాఫిక్ రూల్స్ అమలులో భాగంగా..వాహనదారులపై వేలకు వేలు ఫైన్లు వేస్తున్న కొందరు పోలీసులు మాత్రం రూల్స్ ని ఏమాత్రం  పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 

బైకర్స్ హెల్మెట్ పెట్టుకోకపోయినా..కారు డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ట్రాఫిర్ రూల్స్ అంటూ వేలకు వేలు ఫైన్లు వేస్తుండటం ఇటీవల చూస్తున్నాం. ఈ క్రమంలో పోలీసులు కారులో వెళ్తుండగా..డ్రైవింగ్ చేసే పోలీస్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటాన్ని గమనించిన ప్రజలు పోలీసులు వాహనాన్ని ఆపి నిలదీశారు. రూల్స్ మాకేనా? మీరు వర్తించవా అని ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డారు.  

ప్రజలపై ఇష్టానుసారంగా వేలకు వేల రూపాలు ఫైన్  వేస్తున్న పోలీసులకు మాత్రం పైనుంచి దిగి వచ్చారా? ప్రజలకు వర్తించే రూల్స్ మీరు మాత్రం పాటించరా? మీరెందుకు సీటు బెల్టు పెట్టుకోవ‌డం లేద‌ని నిల‌దీశారు. పోలీసు వాహ‌నం మీద‌కు వ‌స్తూ తీవ్ర స్థాయిలో దుర్భాష‌లాడారు. దీంతో పోలీసులు చేసేందేం లేక తోక ముడిచారు. తరువాత వాహ‌నం న‌డుపుతున్న పోలీసు సీటు బెల్టు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఘటన బీహార్ ముజ‌ఫ‌ర్‌పూర్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 13)న జరిగింది.