Lockdown లో బిర్యానీకే ప్రజల ఓటు..ఫుడ్ ఛార్ట్ లో టాప్ ప్లేస్

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 07:48 AM IST
Lockdown లో బిర్యానీకే ప్రజల ఓటు..ఫుడ్ ఛార్ట్ లో టాప్ ప్లేస్

biryani

కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్పించుకున్నారని, మొత్తం 5.5 లక్షల సార్లు చికెన్ బిర్యానిని ఆర్డర్ చేసినట్లు నివేదిక వెల్లడిస్తోంది.

కరోనా వైరస్ విస్తరించంతో కేంద్రం ప్రభుత్వం Lockdown విధించిన సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు సమయంలో విధించిన లాక్ డౌన్ ను కొన్ని రోజుల తర్వాత సడలింపులు ఇచ్చింది. జూన్ నెల నుంచి అన్ లాక్ ప్రారంభమైంది. లాక్ డౌన్ ఉన్న సమయంలో ప్రజలు బయటకు రానివ్వకుండా ఆంక్షలు విధించారు.

దీంతో ఎన్నో వ్యాపారాలు, సంస్థలు మూతపడ్డాయి. అందులో Hotels, restaurants కూడా ఉన్నాయి. అయితే..ప్రజలు మాత్రం లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున బిర్యానీ, కేక్స్ ఆర్డర్ చేసినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే..కొంతమంది మాత్రం హోం ఫుడ్ కే ప్రిపేర్ చేశారు. కొత్త కొత్త వంటకాలు తయారు చేయడానికి చెఫ్స్ అవతారం ఎత్తారు.

అదే సమయంలో ఆన్ లైన్స్ ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 5.5 లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేశారని, 1.20 వేల కేక్స్, బటర్ నాన్ దోశ 3,35,185, మసాల దోశలు 3,31, 423 మంది ఆర్డర్స్ చేశారని నివేదికలో తెలిపింది. తమ కిరాణా ప్లాట్ ఫాం ద్వారా 323 మిలియన్ల కిలోల ఉల్లి, 56 మిలియన్ అరటిపండ్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.

ప్రతి రోజు రాత్రికి 65 వేల భోజనం ఆర్డర్స్ వచ్చినట్లు, 3, 50, 000 ప్యాకెట్ల ఇన్ స్టాంట్ నూడుల్స్ ఆర్డర్ చేశారని వెల్లడించింది.
లాక్ డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్లను కూడా పంపిణీ చేశామంది. 73 వేల బాటిల్స్ శానిటైజర్స్, 47 వేల మాస్క్ లను ప్రజలు ఆర్డర్ చేయడం జరిగిందని తెలిపింది. అవసరమైన వారికి భోజనం పెట్టేందుకు రూ. 10 కోట్లు సమీకరించింది.