BJP Gujarat poll list 2022 : బీజేపీ అభ్యర్థిగా గుజరాత్ ఎన్నికల బరిలో క్రికెటర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య

బీజేపీ అభ్యర్థిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో క్రికెటర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య పోటీ చేయనున్నారు.

BJP Gujarat poll list 2022 : బీజేపీ అభ్యర్థిగా గుజరాత్ ఎన్నికల బరిలో క్రికెటర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య

BJP Gujarat Elaction list 2022 : క్రికెట్ ర‌వీంద్ర జ‌డేజా భార్య గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో గురువారం (నవంబర్ 10,2022) బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. గుజరాత్ బీజేపీ పార్టీ ఇవాళ 160 స్థానాల‌కు చెందిన అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది.

అ జాబితాలో క్రికెట్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజా పేరును పేర్కొంది బీజేపీ. జామ్ న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రివాబా జ‌డేజా పోటీ చేయ‌నున్నారు. అలాగే గుజరాత్ హోంశాఖ మంత్రి హ‌ర్ష సంఘ‌వి .. మ‌జురా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్ధిక్ ప‌టేల్ .. విరాంగ‌మ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్‌.. ఘ‌ట్‌లోదియా స్థానం నుంచి పోటీ చేస్తారు.

కాగా ఈ ఎన్నికల్లో 38మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. మోర్బీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా చోటు దక్కకపోవటం గమనించాల్సిన విషయం. ఈ జాబితాలో 14 మంది మహిళలతో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే షెడ్యూల్స్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి పలువురు ఉన్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉన్నారు.